ఊర్మిళ (నటి)
భారతీయ సినీ నటి / From Wikipedia, the free encyclopedia
ఊర్మిళ మతోండ్కర్ (జననం. 4 ఫిబ్రవరి 1974) ఒక భారతీయ సినీనటి, రాజకీయ నాయకురాలు.[2] ఈమె ప్రధానంగా హిందీ సినిమాల్లో నటించింది. ఇవి కాకుండా కొన్ని తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది.
త్వరిత వాస్తవాలు ఊర్మిళ మతోండ్కర్, జననం ...
ఊర్మిళ మతోండ్కర్ | |
---|---|
జననం | (1974-02-04) 1974 ఫిబ్రవరి 4 (వయసు 50)[1] |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1980–ప్రస్తుతం |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ (మార్చి 2019 — సెప్టెంబరు 2019) |
జీవిత భాగస్వామి | Mohsin Akhtar Mir (m. 2016) |
మూసివేయి
1980 లో మొదటిసారిగా మరాఠీ సినిమా జాకోల్ లో బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించింది. 1981 లో కలియుగ్ అనే హిందీ సినిమాలో కనిపించింది. 1983 లో మసూం అనే సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించింది. 1989 లో మలయాళం సినిమా చాణక్యన్ తో పెద్ద పాత్రలు ధరించడం ప్రారంభించింది. తర్వాత హిందీలో నరసింహా అనే సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు బాగా విజయవంతం అయ్యాయి.
కొద్ది రోజులు ఆమె సినిమాలు పెద్దగా ఆడకపోయినా 1995 లో వచ్చిన రంగీలా సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. 1997 లో వచ్చిన జుదాయీ, 1998లో వచ్చిన సత్య ఆమెకు మరిన్ని విజయాలు సంపాదించి పెట్టాయి.