తామర వ్యాధి
From Wikipedia, the free encyclopedia
తామర వ్యాధి, చర్మానికి సంబంధించిన ఒక అంటువ్యాధి.[2] మనుషులకూ, పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులకూ, గొర్రెలు, పశువుల వంటి సాధు జంతువులకూ ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సాధారణంగా ఎరుపు రంగులో, దురదతో, పొలుసులుగా, వృత్తాకార దద్దుర్లుగా మారుతుంది. అంతేకాకుండా దీని ప్రభావం వల్ల ఆ ప్రాంతంలో జుట్టు రాలడం కూడా సంభవిస్తుంది. నాలుగు నుండి పద్నాలుగు రోజుల తరువాత దీని లక్షణాలు కనపడుతాయి.[1] ఒక్కోసారి శరీరంపైన ఒకటికంటే ఎక్కువ ప్రాంతాలలో ఒకేసారి తన ప్రభావం చూపిస్తుంది.[4]
తామర వ్యాధి | |
---|---|
పర్యాయపదాలు | తామర, టినియా |
మానవపాదంపై తామరవ్యాధి | |
ప్రత్యేకత | చర్మవ్యాధి |
లక్షణాలు | ఎరుపురంగు, దురద, పొలుసులు, వృత్తాకార దద్దుర్లు[1] |
కారణాలు | మైకోసిస్[2] |
ప్రమాద కారకాలు | క్రీడలు ఆడేవారికి, కుస్తీ పోటీలలో పాల్గొనేవారికి, సామూహిక స్నానాలు చేసినవారికి, పెంపుడు జంతువులతో గడిపేవారికి, స్థూల కాయం ఉన్నవారికి, రోగనిరోధక శక్తి లేనివారికి[3][4] |
రోగనిర్ధారణ పద్ధతి | వ్యాధి లక్షణాలు, మైక్రోస్కోప్ పరీక్ష[5] |
భేదాత్మక నిర్ధారణ | చర్మవ్యాధి, సోరియాసిస్, పిట్రియాసిస్ రోసియా, టినియా వర్సికలర్[6] |
నివారణ | చర్మాన్ని పొడిగా ఉంచుకోవడండి, చెప్పులు లేకుండా నడవకూడదు, వ్యక్తిగత వస్తువులను పంచుకోకూడదు[3] |
చికిత్స | క్రీములు (క్లోట్రిమజోల్ లేదా మైకోనజోల్)[7] |
తరచుదనం | 20% జనాభా[8] |
ట్రైకోఫైటన్, మైక్రోస్పోరం, ఎపిడెర్మోఫైటన్ రకానికి చెందిన దాదాపు 40 రకాల శిలీంధ్రాల ద్వారా ఈ తామర వ్యాధి వచ్చే అవకాశం ఉంది.[2] ఈ వ్యాధి కలిగించే శిలీంధ్రాలకు కెరటిన్ ఆహారంగా ఉపయోగపడుతుంది. ఈ కెరటిన్ పదార్థం చర్మం ఉపరితలంపై, వెంట్రుకలు, గోళ్ళలో లభిస్తుంది. క్రీడలు ఆడేవారికి, కుస్తీ పోటీలలో పాల్గొనేవారికి, సామూహిక స్నానాలు చేసినవారికి, పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపేవారికి, స్థూల కాయం ఉన్నవారికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఎక్కువ.[5]