భారతీయ సంగీత వాయిద్యాల జాబితా
సంగీతాన్ని ఉత్పత్తి చేయు వివిధ సాధనాలు. / From Wikipedia, the free encyclopedia
భారతీయ సంగీత వాయిద్యాలు అనేవి భారతీయ సంగీతంలో పాటకు అనుగుణంగా సంగీత ధ్వనిని ఉత్పత్తిచేసే పరికరాలు. ధ్వనిని ఉత్పత్తి చేసే పద్ధతి ద్వారా వీటిని పలు విధాలుగా వర్గీకరిస్తారు. వీటిలో ముఖ్యమైనవిగా కార్డోఫోన్లు (స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్), ఏరోఫోన్లు (విండ్ ఇన్స్ట్రుమెంట్స్), మెంబ్రానోఫోన్లు (డ్రమ్స్), ఇడియోఫోన్లు (డ్రమ్-కాని పెర్కషన్ వాయిద్యాలు), ఎలక్ట్రానిక్ పరికరాలు చెప్పుకోవచ్చు.[1]
శాస్త్రీయ సంగీతానికి ప్రసిద్ధ కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలోని మిరాజ్ నగరం మ్యూజికల్ సిటీ ఆఫ్ ఇండియాగా విరాజిల్లుతోంది. దేశంలోని చాలామంది అగ్రశ్రేణి సంగీతకారులు ఇక్కడ రూపొందించిన సంగీత వాద్యాలను ముఖ్యంగా తంబురా, సితార్, సారంగి, వీణ వంటి వాటిని వినియోగిస్తుంటారు.[2]