రాఖీ పౌర్ణమి
సోదరీసోదరుల అనుబంధ సూచకంగా జరుపుకునే పండుగ / From Wikipedia, the free encyclopedia
రాఖీ, రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్య విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ.సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు.ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది తీసివేస్తారు .
త్వరిత వాస్తవాలు రాఖీ పౌర్ణమి, అధికారిక పేరు ...
రాఖీ పౌర్ణమి | |
---|---|
అధికారిక పేరు | రాఖీ పౌర్ణమి |
యితర పేర్లు | రాఖీ |
జరుపుకొనేవారు | హిందువులు, జైనులు, సిక్కులు, ముస్లిం, బౌద్ధులు, క్రైస్తవులు |
జరుపుకొనే రోజు | పౌర్ణమి (శ్రావణ పౌర్ణమి) |
మూసివేయి