సెలీనా
మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి, మోడల్, ఫాషన్ డిజైనర్, నటి మరియు నిర్మాత / From Wikipedia, the free encyclopedia
సెలీనాగా పేరొందిన సెలీనా క్వింటనెల్లా పెరెజ్ (Selena Quintanilla-Pérez) (1971 ఏప్రిల్ 16– 1995 మార్చి 31) ఒక మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి, నర్తకి, మోడల్, ఫాషన్ డిజైనర్, నటి, నిర్మాత. ఆమె టెజానో సంగీత మహారాణిగా (ద క్వీన్ ఆఫ్ టెజానో మ్యూజిక్) ప్రజల మన్నన పొందింది.[1] టెక్సాస్ రాష్ట్రంలో అమెరికా స్థానిక తెగ అయిన చెరోకీ మూలాలున్న తండ్రికీ, మెక్సికన్-అమెరికన్ సంగీతకారుడైన తండ్రికి జన్మించిన ఆమె ఆరేళ్ళ వయసులోనే సంగీత ప్రతిభ చాటుకుని, పన్నెండవ ఏటనే తొలి ఆల్బం విడుదల చేసింది. 1987లో ప్రతిష్టాత్మక టేజానో పురస్కారాలు సాధించడంతో ప్రాచుర్యం సాధించింది. 1990 దశకంలో స్పానిష్ మాట్లాడే దేశాల్లో పేరు సంపాదించుకుంది. తన 23 ఏట ఆమె అభిమానుల సంఘం అధ్యక్షుడైన యోలాండా అనే వ్యక్తి కాల్చిచంపింది. మరణానంతరం ఆమె జన్మదినాన్ని సెలీనా డేగా గుర్తించి స్మారక కట్టడాలు నిర్మించారు. ఆమె జీవితాన్ని సినిమగానూ తీశారు.
సెలీనా | |
---|---|
జననం | సెలీనా క్వింటనిల్లా (1971-04-16)1971 ఏప్రిల్ 16 |
మరణం | 1995 మార్చి 31(1995-03-31) (వయసు 23) |
మరణ కారణం | తుపాకీ కాల్పులు |
సమాధి స్థలం | సీసైడ్ మెమోరియల్ పార్క్ కార్పస్ క్రిస్టీ, టెక్సాస్ |
స్మారక చిహ్నం | మిరాడర్ దె లా ఫ్లోర్ |
ఇతర పేర్లు | సెలీనా క్వింటనిల్లా పెరేజ్ |
విద్యాసంస్థ | పసిఫిక్ వెస్టర్న్ యూనివర్శిటీ |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1982 (1982)–1995 (1995) |
జీవిత భాగస్వామి | క్రిస్ పెరేజ్
(m. 1992) |
తల్లిదండ్రులు |
|
బంధువులు |
|
సంగీత ప్రస్థానం | |
సంగీత శైలి |
|
లేబుళ్ళు |
|
సంతకం | |