కక్ష్యా వ్యవధి
ఒక వస్తువు మరో వస్తువు చుట్టూ పూర్తి పరిభ్రమణం చేసేందుకు పట్టే సమయం / From Wikipedia, the free encyclopedia
కక్ష్యా వ్యవధి అనేది ఒక నిర్దిష్ట ఖగోళ వస్తువు మరొక ఖగోళ వస్తువు చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి పట్టే సమయం. దీన్ని కక్ష్యా కాలం, పరిభ్రమణ కాలం అని కూడా అనవచ్చు. ఖగోళ శాస్త్రంలో, ఇది సాధారణంగా సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు లేదా గ్రహశకలాలు, గ్రహాల చుట్టూ తిరిగే చంద్రులు, ఇతర నక్షత్రాల చుట్టూ తిరిగే ఎక్సోప్లానెట్లు లేదా బైనరీ నక్షత్రాలకు వర్తిస్తుంది.
సాధారణంగా ఖగోళ వస్తువు కక్ష్య కాలం దాని ప్రాథమిక వస్తువు చుట్టూ 360° తిరిగేందుకు పట్టే కాలం. ఉదా. సూర్యుని చుట్టూ భూమి.
ఖగోళ శాస్త్రంలో కాలాలు సాధారణంగా గంటలు, రోజులు లేదా సంవత్సరాల యూనిట్లలో చూపిస్తారు.