భారతదేశపు జిల్లా
భారతదేశపు రాష్ట్రాల్లోని పరిపాలనా విభాగం / From Wikipedia, the free encyclopedia
జిల్లా భారతదేశంలో రాష్ట్రం తరువాత స్థాయి పాలనా విభాగం. ప్రతి రాష్ట్రాన్ని పరిపాలనా సౌలభ్యం కొరకు కొన్ని జిల్లాలుగా విభజించారు. ప్రతి జిల్లాకు ఒక ఐ.ఏ.యస్. అధికారి కలెక్టర్ గా ఉంటాడు. 2001 లో దేశం లోని జిల్లాల సంఖ్య 593 కాగా 2011 లో 640 కి పెరిగింది. ఏప్రిల్ 2022 నాటికి[update], దేశంలో 773 జిల్లాలున్నాయి.[1]