అంబాలా
హర్యానా లోని నగరం / From Wikipedia, the free encyclopedia
అంబాలా హర్యాణా రాష్ట్రం లోని నగరం. ఇది అంబాలా జిల్లాకు ముఖ్య పట్టణం. నగరంలో అంబాలా కంటోన్మెంట్ (అంబాలా కాంట్ అని అంటారు), అంబాలా సిటీ అనే రెండు ఉప ప్రాంతాలు ఉన్నాయి. ఈరెంటి మధ్య ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది. వీటిని"ట్విన్ సిటీ" లని కూడా పిలుస్తారు. కంటోన్మెంట్ ప్రాంతంలో భారతీయ సైన్యం, భారత వైమానిక దళాలకు పెద్ద స్థావరాలున్నాయి. అంబాలా నగరం సింధు నది పరీవాహక ప్రాంతాన్ని, గంగా నది పరీవాహక ప్రాంతాన్నీ వేరు చేస్తుంది. నగరానికి ఉత్తరాన ఘగ్గర్, దక్షిణాన టాంగ్రీ అనే నదులు ప్రవహిస్తున్నాయి. భౌగోళిక స్థానం కారణంగా, స్థానిక పర్యాటక రంగంలో అంబాలా జిల్లా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంబాలా నగరం చండీగఢ్ నుండి దక్షిణాన 47 కి.మీ., కురుక్షేత్రకు ఉత్తరాన 50 కి.మీ., సిమ్లా నుండి నైఋతిలో 148 కి.మీ., ఢిల్లీ నుండి ఉత్తరంగా 198 కి.మీ., అమృత్సర్ నుండి ఆగ్నేయంగా 260 కి.మీ. దూరంలో ఉంది.
అంబాలా | |
---|---|
నగరం | |
Coordinates: 30.38°N 76.78°E / 30.38; 76.78 | |
దేశం | India |
రాష్ట్రం | హర్యాణా |
జిల్లా | అంబాలా |
స్థాపన | సా.శ. 14 శతాబ్దం |
Founded by | అంబా రాజపుత్ర |
Named for | అంబా రాజపుత్ర లేదా భవానీ అంబ (దేవత) |
Elevation | 264 మీ (866 అ.) |
Population (2011) | |
• Total | 2,07,934 (UA)[1] |
భాషలు[2][3] | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 1330xx,1340xx |
టెలిఫోన్ కోడ్ | 0171 |
ISO 3166 code | IN-HR |
Vehicle registration | HR 01 (city), HR 04 (Naraingarh), HR 54 (Barara), HR 85 (Ambala Cantonment), HR37 (commercial) |
నగర పాలనను అంబాలా మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.