అత్తిపత్తి
ముట్టుకుంటే ముడుచుకునే ఆకులు కల్గిన మొక్కల జాతి / From Wikipedia, the free encyclopedia
అత్తిపత్తి లేదా సిగ్గాకు (ఆంగ్లం Touch-me-not) ముట్టుకుంటే ముడుచుకునే లక్షణం గల ప్రాకే మొక్క. సంస్కృతంలో నిద్రభంగి, లజ్జాకు అని, హిందీలో లాంజోతి, చుయిముయి, షర్మాని అని, తమిళంలో తోట్టసినింగి, నిన్నసినింగి, అని తెలుగులో నిద్రగన్నిక, నిసిగ్గుచితక అని, లాటిన్ లో Neptuniao Leracea & Mimosa Pidica (Sensitive Plant) అని అంటారు ఇది ఫాబేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయనామం మైమోసా ప్యూడికా (లాటిన్లో ప్యూడికా అంటే సిగ్గు అని అర్ధం). ఈ మొక్కను కేవలం దాని విలక్షణతకై పెంచుకుంటుంటారు. అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలివైపుకు ముడుచుకొని వాలిపోతాయి. మళ్లీ కొన్ని నిమిషాల్లో తిరిగి యధాస్థితికి చేరతాయి. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ ప్రాంతాలన్నింటిలో కలుపుమొక్కగా పెరుగుతుంది.
త్వరిత వాస్తవాలు అత్తిపత్తి, శాస్త్రీయ వర్గీకరణ ...
అత్తిపత్తి | |
---|---|
ముట్టుకుంటే ముడుచుకొనే (మైమోసా పుడికా) ఆకులు , పుష్పం | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | మైమోసాయిడే |
Genus: | |
Species: | మై. ప్యూడికా |
Binomial name | |
మైమోసా ప్యూడికా లిన్నయస్ | |
మూసివేయి