అల్ అక్సా మస్జిద్
From Wikipedia, the free encyclopedia
అల్ అఖ్సా మస్జిద్ లేదా మస్జిద్ ఎ అఖ్సా (ఆంగ్లం : Al-Aqsa Mosque) (అరబ్బీ :المسجد الاقصى, సాహిత్యపరంగా అర్థం "సుదూరపు మస్జిద్". ఈ మస్జిద్ జెరూసలేం నగరంలోని ఆలయాల సమూహంలో గలదు. ఈ ఆలయాల సమూహం యూదులకు పరమ పవిత్రంగా భావిస్తారు.[2][3] సార్వజనీయంగాను మరీ ముఖ్యంగా సున్నీ ముస్లింల విశ్వాసాల ప్రకారం, ఇస్లాంమతములో మూడవ పవిత్రక్షేత్రం. ఇస్రా , మేరాజ్ కొరకు ముహమ్మద్ ప్రవక్త బయలు దేరినది ఈ మస్జిద్ నుండేనని ముస్లింల విశ్వాసం.[4] ముహమ్మద్ ప్రవక్త మదీనాకు హిజ్రత్ చేసిన 17 నెలలవరకూ ఈ అఖ్సా మస్జిద్ ఖిబ్లాగా వ్యవహరింపబడింది. ఆ తరువాత మక్కాలోని కాబా గృహం ఖిబ్లాగా ప్రకటింపబడి స్థిరపడింది.[5]
Al-Aqsa Mosque Masjid al-Aqsa | |
---|---|
Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/Old Jerusalem" does not exist.Location within the Old City of Jerusalem | |
Coordinates: 31.77617°N 35.23583°E / 31.77617; 35.23583 | |
ప్రదేశం | Old City of Jerusalem |
ప్రారంభం | 705 CE |
ఇస్లామిక్ శాఖ/సంప్రదాయం | Islam |
నిర్వహణ | Waqf |
నాయకత్వం | Imam(s): Muhammad Ahmad Hussein |
నిర్మాణ సమాచారం | |
నిర్మాణ శైలి | Early Islamic, Mamluk |
సామర్థ్యం | 5,000+ |
Dome(s) | 2 large + tens of smaller ones |
మీనార్/మీనార్లు | 4 |
మీనార్ ఎత్తు | 37 meters (121 ft) (tallest) |
భవన సామాగ్రి | Limestone (external walls, minaret, facade) stalactite (minaret), Gold, lead and stone (domes), white marble (interior columns) and mosaic[1] |
ఈ అఖ్సా మసీదు, ఒక చిన్న ప్రార్థనాలయంగా, రాషిదూన్ ఖలీఫా అయిన ఉమర్ చే నిర్మింపబడింది. ఉమయ్యద్ ఖలీఫా అయిన అబ్దుల్ మాలిక్ దీనిని విస్తరించాడు. ఇతడి అల్లుడైన అల్-వలీద్ సా.శ. 705 లో పూర్తిగావించాడు.[6]