ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ
From Wikipedia, the free encyclopedia
నవాబ్ మొహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ (1910 మార్చి 16 - 1952 జనవరి 5), భారతీయ యువరాజు, క్రికెట్ ఆటగాడు.
మొహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నవాబ్ ఆఫ్ పటౌడీ | ||||||||||||||||||||||||||||||||||||||||
నవాబ్ ఆఫ్ పటౌడీ | ||||||||||||||||||||||||||||||||||||||||
Reign | 1917–1948 1948–1952 (నామమాత్రం) | |||||||||||||||||||||||||||||||||||||||
Coronation | 1931 డిసెంబరు | |||||||||||||||||||||||||||||||||||||||
Predecessor | మొహమ్మద్ ఇబ్రహీం అలీ ఖాన్ పటౌడీ | |||||||||||||||||||||||||||||||||||||||
Successor | మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (నామమాత్రం) | |||||||||||||||||||||||||||||||||||||||
జననం | మొహమ్మద్ ఇఫ్తికర్ అలీ ఖాన్ పటౌడీ మూస:Beath date పటౌడీ, పటౌడీ సంస్థానం, బ్రిటిషు భారతదేశం (ఇప్పటి హర్యానా) | |||||||||||||||||||||||||||||||||||||||
మరణం | 1952 జనవరి 5(1952-01-05) (వయసు 41) న్యూ ఢిల్లీ | |||||||||||||||||||||||||||||||||||||||
Burial | పటౌడీ, హర్యానా | |||||||||||||||||||||||||||||||||||||||
పట్టపురాణి | సాజిదా సుల్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||
Issue | మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, ముగ్గురు కుమార్తెలు | |||||||||||||||||||||||||||||||||||||||
House | నవాబ్ ఆఫ్ పటౌడీ | |||||||||||||||||||||||||||||||||||||||
తండ్రి | మొహమ్మద్ ఇబ్రహీం అలీ ఖాన్ పటౌడీ | |||||||||||||||||||||||||||||||||||||||
తల్లి | షహర్ బానో బేగం | |||||||||||||||||||||||||||||||||||||||
మతం | సున్నీ ఇస్లాం | |||||||||||||||||||||||||||||||||||||||
Occupation | క్రికెట్ ఆటగాడు, ప్రభుత్వ అధికారి | |||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | Pat | |||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 ft 0 in (1.83 m) | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టులు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 265/32) | 1932 డిసెంబరు 2 ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1946 ఆగస్టు 20 ఇండియా - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1928–1931 | ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1932–1938 | వోర్సెస్టర్షైర్ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
1945/46 | దక్షిణ పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 మే 12 | ||||||||||||||||||||||||||||||||||||||||
పటౌడీ 1946లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. అతని కుమారుడు మన్సూర్ కూడా, ఆ తరువాత భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా పనిచేశాడు. అతన్ని నవాబ్ ఆఫ్ పటౌడీ జూనియర్ అని పిలుస్తారు,
పటౌడీ 1932, 1934లో ఇంగ్లండ్ జట్టు తరపున టెస్ట్ క్రికెట్ ఆడాడు, రెండు దేశాలకు టెస్ట్ క్రికెట్ ఆడిన అతి కొద్ది మంది క్రికెటర్లలో అతనొకడు. భారతదేశం, ఇంగ్లండ్ రెండింటికీ ఆడిన ఏకైక టెస్టు క్రికెటరతడు.[1] అతను మొత్తం ఆరు టెస్టుల్లో - మూడు భారత కెప్టెన్‌గా, మూడు ఇంగ్లండ్‌కు ఆడాడు. [2]
పటౌడీ 1917 నుండి 1947 వరకు బ్రిటిష్ రాజ్ సమయంలో పటౌడీ సంస్థానాన్ని పాలించిన నవాబు. అది స్వతంత్ర భారతదేశంలో విలీనమైన తర్వాత, అతనికి భారత ప్రభుత్వం ప్రీవీ పర్సు, కొన్ని అధికారాలు, నవాబ్ ఆఫ్ పటౌడీ అనే బిరుదునూ ఇచ్చింది, [3]1952లో మరణించే వరకు అతను దానిని వాడుకున్నాడు.