ఇషాంత్ శర్మ
భారత దేశపు క్రికెట్ క్రీడాకారుడు / From Wikipedia, the free encyclopedia
ఇషాంత్ శర్మ (జననం 1988 సెప్టెంబరు 2) భారతదేశానికి టెస్టులు, వన్డేలు, T20I లలో ప్రాతినిధ్యం వహించిన క్రికెట్ ఆటగాడు.. అతను 6 అడుగుల 4 అంగుళాల పొడవున్న [1] [2] [3] కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్. [4] [5] 18 సంవత్సరాల వయస్సులో శర్మ, 2006-07లో దక్షిణాఫ్రికా పర్యటించిన భారత జట్టులో చేరమని కబురొచ్చింది. అయితే, ప్రయాణ ఏర్పాట్లు చేసుకుంటూండగా అతన్ని ఎంపిక చెయ్యలేదని మళ్ళీ కబురొచ్చింది.[6] అండర్-19 రోజులలో అతని ఎత్తు, బక్కపల్చటి శరీరాకృతిని ప్రస్తావిస్తూ, అతనికి లంబూ అని మారుపేరు పెట్టారు. [7] [8] 2011లో, అతను 100 టెస్ట్ వికెట్లు సాధించిన ఐదవ అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 2013లో దక్షిణాఫ్రికాపై ఇషాంత్ శర్మ వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు. "రిథమ్" బౌలర్‌గా ఉన్నప్పటికీ, 150 కిమీ/గం పైచిలుకు వేగంతో బౌలింగ్ చేసిన అత్యంత వేగవంతమైన భారతీయ బౌలర్లలో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. 2011లో బాక్సింగ్ డే టెస్ట్‌లో రికీ పాంటింగ్‌కి 152.2 కిమీ/గం వేగంతో బంతి వేశాడు. 2020లో, క్రికెట్లో అతని అత్యుత్తమ విజయాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అతనికి అర్జున అవార్డును ప్రదానం చేసింది. 2013 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టులో శర్మ సభ్యుడు.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఇషాంత్ శర్మ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | (1988-09-02) 1988 సెప్టెంబరు 2 (వయసు 35) ఢిల్లీ, India | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | లంబూ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 ft 4 in (193 cm) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్ మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 258) | 2007 మే 25 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2021 నవంబరు 25 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్డే (క్యాప్ 169) | 2007 జూన్ 29 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్డే | 2016 జనవరి 17 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్డేల్లో చొక్కా సంఖ్య. | 1 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 21) | 2008 ఫిబ్రవరి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2013 అక్టోబరు 10 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 1 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–present | ఢిల్లీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011–2012 | డెక్కన్ చార్జర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013–2015 | సన్ రైజర్స్ హైదరాబాద్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016 | రైజింగ్ పూణే సూపర్‌జైంట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | కింగ్స్ XI పంజాబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2019–present | ఢిల్లీ క్యాపిటల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 25 November 2021 |
2021 ఫిబ్రవరిలో, ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇషాంత్, టెస్ట్ క్రికెట్లో తన 300వ వికెట్‌ను తీసుకున్నాడు.[9][10] అతన్ని భారత క్రికెట్లోని గొప్ప పేసర్లలో ఒకరిగా పరిగణిస్తారు.[11]