కంబోడియా
ఆసియా ఖండంలోని ఒక దేశం / From Wikipedia, the free encyclopedia
కంబోడియా (English: Cambodia లేదా Kampuchea; Khmer: កម្ពុជា, Kâmpŭchéa కంపూచియా ), ఆధికారికంగా కంపూచియా సామ్రాజ్యము అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. ఈ దేశం మొత్తం భూ వైశాల్యం 181,035 చదరపు కిలోమీటర్లు. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో థాయ్ లాండ్ జలసంధి ఉన్నాయి. 1.48 కోట్ల జనాభా కలిగిన కంబోడియా ప్రపంచంలో జనసాంద్రతలో 68వ స్థానంలో ఉంది. కంబోడియా అధికార మతం " తెరవాడ బౌద్ధమతం". తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు, 30 రకాల గిరిజనులు మొదలైన వారు. దేశరాజధాని, దేశంలోని అతి పెద్ద నగరమైన " నాంఫెన్" కాంబోడియా సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కేంద్రమని చెప్పవచ్చు. రాచరిక విధానం అనుసరిస్తున్న దేశమిది. రాజ సింహాసన మండలి చేత ఎన్నుకొనబడిన అధిపతి రాజ్యనిర్వహణ బాధ్యత వహిస్తాడు. ప్రభుత్వ అధ్యక్షుడు అయిన " హన్ సెన్" కంబోడియాను 25 సంవత్సరాల నుంచి పాలన చేస్తూ, దక్షిణాసియాలోనే దీర్ఘకాల పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు.
Preăh Réachéanachâkr Kâmpŭchea Kingdom of Cambodia |
||||
---|---|---|---|---|
నినాదం "Nation, Religion, King" |
||||
జాతీయగీతం Nokoreach |
||||
రాజధాని అతి పెద్ద నగరం | Phnom Penh 11°33′N 104°55′E | |||
అధికార భాషలు | Khmer | |||
ప్రభుత్వం | Democratic constitutional monarchy | |||
- | King | Norodom Sihamoni | ||
- | Prime Minister | Hun Sen | ||
Independence | ||||
- | from France | 1953 | ||
- | from Vietnam | 1989 | ||
విస్తీర్ణం | ||||
- | మొత్తం | 181,035 కి.మీ² (89th) 69,898 చ.మై |
||
- | జలాలు (%) | 2.5 | ||
జనాభా | ||||
- | July 2006 అంచనా | 13,971,000 (63rd) | ||
- | 1998 జన గణన | 11,437,656 | ||
- | జన సాంద్రత | 78 /కి.మీ² (112th) 201 /చ.మై |
||
జీడీపీ (PPP) | 2006 అంచనా | |||
- | మొత్తం | $36.82 billion (89th) | ||
- | తలసరి | $2,600 (133rd) | ||
మా.సూ (హెచ్.డి.ఐ) (2004) | 0.583 (medium) (129th) | |||
కరెన్సీ | Riel (៛)1 (KHR ) |
|||
కాలాంశం | (UTC+7) | |||
- | వేసవి (DST) | (UTC+7) | ||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .kh | |||
కాలింగ్ కోడ్ | +855 | |||
1 | Local currency, although US dollars are widely used. |
కంపూచియా పురాతన నామము " కాంభోజ". 802 లో రెండవ జయవర్మ స్వయంగా తనకు తాను రాజుగా ప్రకటించుకోవడంతో ఖైమర్ సామ్రాజ్యం అంకురించింది. ఖైమర్ సామ్రాజ్యం దిగ్విజయంగా సమర్థులైన రాజులతో 600 సంవత్సరాల కాలం కొనసాగింది. ఖైమర్ సామ్రాజ్య కాలంలో కేంద్రీకృత అధికారం, విస్తార సంపదలతో కంబోడియా దక్షిణాసియా దేశాలలో ఆధిపత్యం సాధించింది. ఆంకర్ వాట్ వంటి హిందూరాజుల కాలంలో ప్రపంచ ప్రసిద్ధ దేవాలయాల నిర్మాణం జరిగింది. దక్షిణాసియాలో హిందూమతం విస్తరణకు ఈ ఆలయాలు తార్కాణంగా నిలిచాయి. తరువాత ఇక్కడ బౌద్ధమతం విస్తరించింది. 15 వ శతాబ్దంలో ఆంకర్ పతనమై "ఆయుధాయ" సామ్రాజ్యం అవతరించిన తరువాత కంబోడియా 19 శతాబ్దం మధ్యకాలంలో ఫ్రెంచి వలసలు ఆరంభం అయ్యే వరకు పొరుగు రాజ్యాలతో కలిసి సామంతరాజ్యంగా ఉండిపోయింది. 1953 లో కంబోడియా స్వతంత్ర రాజ్యంగా అవతరించింది.
వియత్నాం యుద్ధం కంపూచియాయా వరకు విస్తరించిన తరువాత అవతరించిన " ఖేమర్ రోగ్ " పార్టీ, 1975 నాటికి కంబోడియాను వశపరచుకుకుంది. కొన్ని సంవత్సరాల తరువాత కంబోడియా తిరిగి సోషలిస్ట్ భావ ప్రభావితమైన " పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కంబోడియా"తో విలీనమైంది. 1993 వరకూ ఇలా కొనసాగిన తరువాత, ఏకాంతం వీడి 1993 లో యుద్ధవినాశిత దేశమైన కంబోడియా సమైక్య సామ్రాజ్యంగా అవతరించింది. దశాబ్దాల అంతర్యుద్ధం తరువాత దేశం శరవేగంగా ఆర్ధికరంగం , మానవ వనరుల అభివృద్ధి సాధించింది. ఆసియాలో అత్యున్నత ఆర్ధిక ఫలితాలు సాధించిన దేశాలలో కంబోడియా ఒకటి. గడిచిన 10 సంవత్సరాలలో కంబోడియా సాధించిన ఆర్ధిక ప్రగతి 6%. వస్త్రపరిశ్రమ, వ్యవసాయం, నిర్మాణరంగం, దుస్తుల తయారీ , పర్యటక రంగాలలో కంబోడియా తగినంత ప్రగతిని సాధించింది. 2001 లో కంబోడియా జలభాగంలో చమురు , సహజ వాయువుల నిక్షేపాలు కనుగొనబడ్డాయి. వీటి నుండి 2013 నుండి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభమవుతుంది. కంబోడియా ఆర్ధిక రంగాన్ని చమురు ఉత్పత్తులు శక్తివంతంగా ప్రభావిం చేయనున్నాయి.
"కంపూచియా సామ్రాజ్యము" : ఇది ఆగ్నేయాసియా లోని ఇండోచైనా భూభాగం లోని దక్షిణ ప్రాంతానికి చెందిన ఒక దేశం. ఈ దేశపు మొత్తం విస్తీర్ణం 1,81,035 చదరపు కిలోమీటర్లు. తూర్పున వియత్నాం, నైరుతిలో థాయిలాండ్, ఈశాన్యంలో లావోస్, వాయవ్యంలో థాయిలాండ్ జలసంధి దేశానికి సరిహద్దులు. 1.48 కోట్ల జనాభాలో 95% మంది బౌద్ధ మతావలంబకులు. కంపూచియా ప్రాచీన నామం "కాంభోజ". లింకు పేరు