కటక్
ఒడిశాలో రెండవ అతిపెద్ద నగరం / From Wikipedia, the free encyclopedia
కటక్ ఒడిషా రాష్ట్రానికి పూర్వ రాజధాని. రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరం. ఇది కటక్ జిల్లాకు ప్రధాన కేంద్రం. కోట అనే అర్ధం గల కటకా ఈ నగరపు అసలు పేరు. పురాతన బారాబతి కోట ఈ పేరుకు మూలం. ఈ కోట చుట్టూరానే నగరం తొలుత అభివృద్ధి చెందింది. 1000 సంవత్సరాల చరిత్ర, ప్రసిద్ధి గాంచిన వెండి ఫిలిగ్రీ పనుల కారణంగా కటక్‌ను మిలీనియం సిటీ అని, సిల్వర్ సిటీ అనీ పిలుస్తారు. ఒరిస్సా హైకోర్టు [2] ఇక్కడే ఉంది. ఇది ఒడిశా వాణిజ్య రాజధాని. నగరం లోను, చుట్టుపక్కలా అనేక వ్యాపార సంస్థలున్నాయి. కటక్ దుర్గా పూజకు ప్రసిద్ధి చెందింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మస్థలం కటక్. భారత ప్రభుత్వం ఉపయోగించే ర్యాంకింగ్ సిస్టమ్ ప్రకారం ఈ నగరాన్ని టయర్-II నగరంగా వర్గీకరించారు.[3][4][5]
కటక్ కటక |
|
---|---|
— నగరం — | |
[[File:|250px|none|alt=|పైనుండి సవ్యదిశలో: బలి జత్రా ద్వారం, బారాబతి స్టేడియం, బాన్సురా ఆలాయం, మహానది వంతెన, కటక్ మా చండీ, బారాబతి కోట]]పైనుండి సవ్యదిశలో: బలి జత్రా ద్వారం, బారాబతి స్టేడియం, బాన్సురా ఆలాయం, మహానది వంతెన, కటక్ మా చండీ, బారాబతి కోట | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | కటక్ |
స్థాపన | సా.శ. 989 |
Founder | మర్కట్ కేశరి వంశం |
Named for | ప్రాచీన ఉత్కళ సైనిక గుడారం |
Area rank | ఒడిశాలో 2వ స్థానం |
జనాభా (2011)[1] | |
- నగరం | 6,06,007 |
- Metro | 6,66,702 |
భాషలు | |
- అధికారిక | ఒరియా |
Time zone | IST (UTC+5:30) |
ZIP code(s) | 7530xx/754xxx |
Telephone code | 0671 |
Vehicle registration | OD-05 |
UN/LOCODE | IN CUT |
పాత నగరం కథజోడి, మహానది నదుల మధ్య ఉన్న భూభాగంలో ఉంది. దీనికి ఆగ్నేయ సరిహద్దుగా పాత జగన్నాథ్ రహదారి ఉంది.[6] 59 వార్డులతో కూడిన కటక్ మున్సిపల్ కార్పొరేషను నగర పరిపాలన నిర్వహిస్తుంది.[7] కటక్ నగరం, దక్షిణాన కథజోడి మీదుగా ఫుల్నాఖరా నుండి ఉత్తరాన బిరూపా నది మీదుగా చౌద్వార్ వరకు విస్తరించి ఉంది. తూర్పున కందర్పూర్ వద్ద ప్రారంభమై పశ్చిమాన నారాజ్ వరకు వెళుతుంది. మహానది దాని ఉపనదులైన కథజోడి, కుఖాయ్, బిరుపాలు నగరం గుండా ప్రవహిస్తున్నాయి. కథజోడి నది కూడా ఇక్కడ దేవి, బిలుఖాయి అనే రెండు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. వీటన్నిటి కారణంగా నగర భౌగోళికం దారాలతో అల్లుకున్నట్లుగా కనిపిస్తుంది.
కటక్, భువనేశ్వర్‌లను ఒడిశా జంట నగరాలుగా పేర్కొంటారు. రెండు నగరాలతో ఏర్పడిన మెట్రోపాలిటన్ ప్రాంతం జనాభా 2018లో 18.62 లక్షలు [8] కటక్ ఒక ప్రణాళిక లేని నగరం. వీధులు, సందులు, గొందులతో ఉంటుంది. అందుకే ఈ నగరాన్ని బౌనా బజార్, టెపనా గలీ అని పిలుస్తారు. దీనికి అర్థం - 52 వీధులు, 53 సందులు అని.