కుల్లూ
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
కుల్లూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. కుల్లూ జిల్లాకు ముఖ్య పట్టణం కూడా. ఇది కుల్లూ లోయలో బియాస్ నది ఒడ్డున ఉంది.
త్వరిత వాస్తవాలు కుల్లూ కుల్లూ, దేశం ...
కుల్లూ
కుల్లూ | |
---|---|
పట్టణం | |
దేశం | India |
రాష్ట్రం | హిమాచల్ ప్రదేశ్ |
జిల్లా | కుల్లు |
Elevation | 1,279 మీ (4,196 అ.) |
Population (2011) | |
• Total | 18,536 |
భాషలు | |
• అధికారిక | Hindi |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 175101 |
టెలిఫోన్ కోడ్ | 01902 |
లింగ నిష్పత్తి | 1.17 (1000/852) ♂/♀ |
Website | www.hpkullu.gov.in |
మూసివేయి
కుల్లూ లోయ మనాలి, లార్గి ల మధ్య బియాస్ నది వలన ఏర్పడిన వెడల్పైన బహిరంగ లోయ. దేవాలయాలకు, పైన్ దేవదారు అడవులు కప్పేసిన కొండలకు, విస్తారమైన యాపిల్ తోటలకూ ఈ లోయ ప్రసిద్ధి చెందింది. కుల్లూ లోయ, పీర్ పంజాల్ శ్రేణి, దిగువ హిమాలయాలు, మహా హిమాలయ శ్రేణుల మధ్య ఉంది. కుల్లూ నుండి 10 కి.మీ. దూరం లోని భుంతర్ వద్ద విమానాశ్రయం ఉంది.