గాంగ్టక్
సిక్కిం రాష్ట్ర రాజధాని / From Wikipedia, the free encyclopedia
గాంగ్టక్, భారతదేశంలోని సిక్కిం రాష్ట్ర రాజధాని, సిక్కిం రాష్ట్రంలోని అతిపెద్ద పట్టణం. తూర్పు సిక్కిం జిల్లా ప్రధాన కార్యాలయం, ఒక నగరం, మునిసిపాలిటీ. ఇది తూర్పు హిమాలయ శ్రేణిలో 1,650 మీటర్ల (5,410 అడుగుల) ఎత్తులో ఉంది. ఈ పట్టణంలో 1,00,000 జనాభా ఉంది. ఇక్కడ భూటియా, లెప్చా, ఇండియన్ గూర్ఖాల వంటి వివిధ జాతుల వారు ఉన్నారు.
త్వరిత వాస్తవాలు గాంగ్టక్, దేశం ...
గాంగ్టక్ | |
---|---|
రాష్ట్ర రాజధాని | |
Coordinates: 27.33°N 88.62°E / 27.33; 88.62 | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | సిక్కిం |
జిల్లా | తూర్పు సిక్కిం |
Government | |
• Type | నగర పాలక సంస్థ |
• Body | గాంగ్టక్ నగర పాలక సంస్థ |
• మేయర్ | శక్తి సింగ్ చౌదరి[1] |
Area | |
• Total | 19.2 km2 (7.4 sq mi) |
Elevation | 1,650 మీ (5,410 అ.) |
Population (2011) | |
• Total | 1,00,290 |
• Density | 5,223/km2 (13,530/sq mi) |
భాషలు[3][4] | |
• అధికారిక | |
• ఇతర అధికారిక భాషలు |
|
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 737101 |
టెలిఫోన్ కోడ్ | 03592 |
Vehicle registration | ఎస్ కె-01 |
మూసివేయి
1840లో ఎన్చీ మొనాస్టరీని నిర్మించిన తరువాత ఈ నగరం, బౌద్ధ తీర్థయాత్రగా పేరొందింది. 1894లో సిక్కిం చోగ్యాల్, తూటోబ్ నాంగ్యాల్ రాజధానిని గాంగ్టక్ నగరానికి మార్చారు. 1947లో భారతదేశం బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత, సిక్కిం స్వతంత్ర రాజ్యంగా ఉంది. 1975లో భారత యూనియన్‌తో కలిసిన తరువాత, గ్యాంగ్‌టక్‌ను భారతదేశ 22వ రాష్ట్ర రాజధానిగా చేశారు.