జబల్పూర్
భారత దేశంలోని మధ్య ప్రదేశ్ రాష్ట్రములోని నగరం / From Wikipedia, the free encyclopedia
జబల్పూర్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం. గతంలో దీనిని జబ్బల్పూర్ అని పిలిచేవారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, ఇది మధ్యప్రదేశ్లో మూడవ అతిపెద్ద పట్టణ సముదాయ. దేశంలో 38 వ అతిపెద్ద పట్టణ సముదాయం. రాయ్పూర్ తరువాత మధ్య భారతదేశంలో 2 వ అతిపెద్ద మహానగరం, జబల్పూర్. ఇక్కడికి దగ్గరలోని భేడాఘాట్ వద్ద ఉన్న వైట్ మార్బుల్ రాక్స్ కు ప్రసిద్ది చెందింది. స్నూకర్ ఆట జబల్పూర్ లోనే ఉద్భవించిందని సాధారణంగా అంగీకరించబడింది. భారతదేశంలోని 100 స్మార్ట్ సిటీలలో జబల్పూర్ ఒకటి.
త్వరిత వాస్తవాలు జబల్పూర్ జబ్బల్పూర్, దేశం ...
జబల్పూర్
జబ్బల్పూర్ | ||||||
---|---|---|---|---|---|---|
మెట్రోపాలిటన్ నగరం | ||||||
Coordinates: 23°10′N 79°56′E | ||||||
దేశం | భారతదేశం | |||||
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ | |||||
జిల్లా | జబల్పూర్ | |||||
Government | ||||||
• Body | జబల్పూర్ మునిసిపల్ కార్పొరేషను | |||||
Area | ||||||
• మెట్రోపాలిటన్ నగరం | 263 km2 (102 sq mi) | |||||
Elevation | 412 మీ (1,352 అ.) | |||||
Population | ||||||
• మెట్రోపాలిటన్ నగరం | 12,67,564 | |||||
• Rank | 37th | |||||
• Density | 3,390/km2 (8,800/sq mi) | |||||
• Metro | 14,44,667 | |||||
• Metro rank | 37th | |||||
Time zone | UTC+5:30 (IST) | |||||
PIN | 482001 to 482011 | |||||
టెలిఫోన్ కోడ్ | +91-761 | |||||
ISO 3166 code | IN-MP | |||||
Vehicle registration | MP-20 | |||||
లింగనిష్పత్తి | 929 ♂/♀ | |||||
మూసివేయి
జబల్పూర్ నగరం, జబల్పూర్ జిల్లాకు (మధ్యప్రదేశ్లో రెండవ అత్యధిక జనాభా కలిగిన జిల్లా) ముఖ్యపట్టణం. జబల్పూర్ డివిజనుకు ఇది పరిపాలనా ప్రధాన కార్యాలయం. చారిత్రికంగా,గోండు రాజవంశాలకు కేంద్రంగా ఉన్న ఈ నగరంలో అడపాదడపా మొఘల్, మరాఠా పాలనలచే ప్రభావితమైన సమ్మేళన సంస్కృతి అభివృద్ధి చెందింది.