ట్రినిడాడ్ అండ్ టొబాగో
కరిబియన్ లోని ద్వీప దేశం / From Wikipedia, the free encyclopedia
ట్రినిడాడ్ అండ్ టొబాగో (అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో) , కరేబియన్‌లో దక్షిణాన ఉన్న ద్వీప దేశం. ప్రధాన ద్వీపాలైన ట్రినిడాడ్, టొబాగో లతో పాటు దేశంలో అనేక చిన్న ద్వీపాలు ఉన్నాయి. ఇది గ్రెనడాకు దక్షిణంగా 130 kilometres (81 miles), ఈశాన్య వెనిజులా తీరానికి 11 kilometres (6.8 miles) దూరంలో ఉంది. దీనికి ఈశాన్యంలో బార్బడోస్, వాయవ్య దిశలో గ్రెనడా, దక్షిణ పశ్చిమాల్లో వెనిజులాలు సరిహద్దులుగా ఉన్నాయి.[9][10] ట్రినిడాడ్, టొబాగో వెస్టిండీస్‌లో భాగం.
రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో | ||||||
---|---|---|---|---|---|---|
Motto: టుగెదర్ వియ్ యాస్పైర్, టుగెదర్ వియ్ ఎఛీవ్ | ||||||
Anthem: "ఫోర్జ్డ్ ఫ్రం ది లవ్ ఆఫ్ లిబర్టీ" |
||||||
Capital | పోర్ట్ ఆఫ్ స్పెయిన్ | |||||
Largest city | శాన్ ఫెర్నాండో 10°17′N 61°28′W | |||||
Official languages | ఇంగ్లీషు[1] | |||||
ఇతర భాషలు | See Languages in Trinidad and Tobago[2] | |||||
Ethnic groups (2011) |
|
|||||
Government | యూనిటరీ పార్లమెంటరీ రిపబ్లిక్ | |||||
- | అధ్యక్షుడు | |||||
- | ప్రధానమంత్రి | |||||
- | స్పీకరు | |||||
- | సెనేట్ అధ్యక్షుడు | |||||
- | ప్రధాన న్యాయమూర్తి | |||||
- | ప్రతిపక్ష నేత | |||||
Legislature | పార్లమెంటు | |||||
- | Upper house | సెనేట్ | ||||
- | Lower house | హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ | ||||
స్వాతంత్ర్యం యు.కె నుండి | ||||||
- | వెస్టిండీస్ ఫెడరేషనులో సభ్యుడు | 1958 జనవరి 3 – 1962 జనవరి 14 | ||||
- | స్వాతంత్ర్యం | 1962 ఆగస్టు 31 | ||||
- | CARICOM లో చేరింది | 1973 ఆగస్టు 1 | ||||
- | రిపబ్లిక్ | 1976 ఆగస్టు 1[lower-alpha 1] | ||||
Area | ||||||
- | Total | 5,131 km2 (164th) 1,981 sq mi |
||||
- | Water (%) | బహు స్వల్పం | ||||
Population | ||||||
- | 2021 estimate | 13,67,558[4] (151st) | ||||
- | 2011 census | 13,28,019[5] | ||||
- | Density | 264/km2 (34th) 684/sq mi |
||||
GDP (PPP) | 2019 estimate | |||||
- | Total | $45.148 billion | ||||
- | Per capita | $32,684[6] | ||||
GDP (nominal) | 2022 estimate | |||||
- | Total | $22.438 billion | ||||
- | Per capita | $17,921[6] | ||||
Gini (2012) | 39.0[7] medium |
|||||
HDI (2021) | 0.810[8] very high · 57th |
|||||
Currency | ట్రినిడాడ్ అండ్ టొబాగో డాలర్ (TTD ) |
|||||
Time zone | AST (UTC-4) | |||||
Date format | dd/mm/yyyy | |||||
Drives on the | left | |||||
Calling code | +1 (868) | |||||
Internet TLD | .tt | |||||
|
ట్రినిడాడ్ ద్వీపం 1498లో క్రిస్టోఫర్ కొలంబస్ రాక తర్వాత స్పానిష్ సామ్రాజ్యంలో కాలనీగా మారడానికి ముందు ఇక్కడ శతాబ్దాలుగా స్థానిక ప్రజలు నివసించేవారు. స్పానిష్ గవర్నర్ జోస్ మరియా చాకోన్ 1797లో సర్ రాల్ఫ్ అబెర్‌క్రోంబీ ఆధ్వర్యంలో బ్రిటిష్ నౌకాదళానికి లొంగిపోయాడు. [11] అదే కాలంలో, టొబాగో ద్వీపం స్పానిష్, బ్రిటిష్, ఫ్రెంచ్, డచ్, కోర్లాండర్ వలసవాదుల మధ్య చాలాసార్లు, కరేబియన్‌లోని ఇతర ద్వీపాల కంటే ఎక్కువగా, చేతులు మారింది. 1802లో అమియన్స్ ఒప్పందం ప్రకారం ట్రినిడాడ్, టొబాగోలు బ్రిటన్‌కు దక్కాయి. వీటిని 1889లో ఏకం చేసారు. [11] ట్రినిడాడ్ అండ్ టొబాగో 1962లో స్వాతంత్ర్యం పొంది, 1976లో రిపబ్లిక్‌గా అవతరించింది.[12]
2022 నాటికి ట్రినిడాడ్ అండ్ టొబాగో యునైటెడ్ స్టేట్స్, కెనడా, ప్యూర్టో రికో, బహామాస్, అరుబా, గయానాల తర్వాత అమెరికాఖండ దేశాల్లో కొనుగోలు శక్తి సమానత్వం (PPP) ఆధారంగా అత్యధిక తలసరి GDPలో 7 వ స్థానంలో ఉంది [13] దీన్ని అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచ బ్యాంకు గుర్తించింది.[14] పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడే చాలా కరేబియన్ దేశాలు, భూభాగాల మాదిరిగా కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పారిశ్రామికంగా పెట్రోలియం, పెట్రోకెమికల్స్‌పై ఆధార పడింది.[15] దేశ సంపదలో ఎక్కువ భాగం చమురు, సహజ వాయువుల నిల్వల నుండి వస్తుంది.[16]
ట్రినిడాడ్ అండ్ టొబాగో అక్కడి ఆఫ్రికా, భారతీయ సంస్కృతులకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కార్నివాల్, దీపావళి, హోసే వేడుకలలో ఇది ప్రతిబింబిస్తుంది, అలాగే స్టీల్పాన్, లింబో, కాలిప్సో, సోకా, రాప్సో, పరాంగ్, చట్నీ, చట్నీ సోకా వంటి సంగీత శైలులకు ఇది జన్మస్థలం.[17][18][19][20][21][22][23]