డియెగో మారడోనా
From Wikipedia, the free encyclopedia
డియెగో అర్మాండో మారడోనా ( Spanish: [ˈDjeɣం maɾaˈðంna] ; 1960 అక్టోబరు 30-2020 నవంబరు 25) అర్జెంటీనాకు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు, మేనేజర్. మారడోనా ప్రపంచంలో గొప్ప ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణింపబడుతాడు. 20 వ శతాబ్దపు ఫిఫా ప్లేయర్ అవార్డును పొందిన ఇద్దరు ఉమ్మడి విజేతలలో అతను ఒకడు. [1] [2] మారడోనా చూపు, పాసింగ్, బాల్ మీద కంట్రోల్, డ్రిబ్లింగ్ నైపుణ్యాలు ఇతర ఆటగాళ్ళ కంటే మెరుగ్గా వ్యవహరించడానికి అతనికి వీలు కల్పించింది. పొట్టిగా ఉండడాన అతని శరీర గరిమనాభి భూమికి దగ్గరగా ఉండి, అతడు మెరుగైన ఆటగాడవడానికి తోడ్పడింది. మైదానంలో అతని ఉనికి, నాయకత్వం అతని జట్టు పై గొప్ప ప్రభావాన్ని చూపాయి. అతని సృజనాత్మక సామర్ధ్యాలతో గోల్ చేయడమే లక్ష్యంగా కలిగి ఉండేవాడు. అతడు ఫ్రీ కిక్ స్పెషలిస్ట్‌గా పేరు పొందాడు. చిన్నతనం లోనే అతడు చూపిన ప్రతిభ కారణంగా మారడోనాకు "ఎల్ పిబే డి ఓరో " ("ది గోల్డెన్ బాయ్") అనే పేరు దక్కింది. ఈ పేరు జీవితాంతం అతనితోనే ఉండిపోయింది. [3] 1991,1994 లో మాదకద్రవ్యాలను దుర్వినియోగం చేసినందుకు నిషేధించబడ్డాడు. [4]