ధమనీకాఠిన్యం
శరీరంలో అవయవాలు పనిచేయడానికి అవసరమయే ఒక ప్రక్రియ / From Wikipedia, the free encyclopedia
శరీరంలో అవయవాలు పనిచేయడానికి అవసరమయే ప్రాణవాయువును, పోషకపదార్థాలను అందించుటకు, వాటి జీవనప్రక్రియలో వెలువడే బొగ్గుపులుసువాయువు, ఇతర మాలిన్యాలను తొలగించుటకు రక్తప్రసరణ అవసరం. అవయవాలకు ధమనులు గుండె ఎడమ భాగం నుంచి రక్తంను అందిస్తే, సిరలు వాటి నుంచి రక్తమును గ్రహించి హృదయంలో కుడి భాగానికి చేరుస్తాయి. ఊపిరితిత్తులలో రక్తం బొగ్గుపులుసువాయువును విసర్జించి ప్రాణవాయువును గ్రహిస్తుంది.