బ్లు-రే
From Wikipedia, the free encyclopedia
బ్లు-రే డిస్క్ (BD), డిజిటల్ ఆప్టికల్ డిస్కులో డేటాను నిల్వ చేసే ఒక ఫార్మాట్. దీన్ని సాధారణంగా బ్లు-రే అని పిలుస్తారు. దీన్ని 2005లో కనుగొన్నారు. 2006 జూన్ 20 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసారు. DVD ఫార్మాట్ స్థానంలో దీన్ని రూపొందించారు. అనేక గంటల హై-డెఫినిషన్ వీడియో (HDTV 720p, 1080p ) ను ఇందులో నిల్వ చేయవచ్చు. బ్లు-రే ను ఫీచర్ ఫిల్మ్‌ల వంటి వీడియో మెటీరియల్ కోసం, ప్లేస్టేషన్ 3, ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ వన్, ఎక్స్‌బాక్స్ సిరీస్ X కోసం, వీడియో గేమ్‌ల పంపిణీ కోసమూ దీన్ని వాడతారు. "బ్లు-రే" అనే పేరు డిస్క్‌ను చదవడానికి ఉపయోగించే బ్లూ లేజర్‌ను (వాస్తవానికి ఇది వైలెట్ లేజర్) సూచిస్తుంది. ఇది DVDల లలో ఉపయోగించే పొడవైన తరంగదైర్ఘ్యం కలిగిన ఎరుపు లేజర్‌తో సాధ్యమయ్యే దానికంటే ఎక్కువ సాంద్రతతో సమాచారాన్ని నిల్వ చేస్తుంది.
Blu-ray Disc.svg | |
---|---|
మీడియా టైప్ | అధిక-సాంద్ర ఆప్టికల్ డిస్కు |
ఎన్కోడింగ్ |
|
సామర్ధ్యం |
|
చదివే విధానం (Read mechanism) | 405 nm diode laser, 36 Mbit/s |
వ్రాసే విధానం (Write mechanism) | 405 nm diode laser with a focused beam using more power than for reading |
రూపొందించిన వారు |
|
పరిమాణం |
|
వినియోగం |
|
Extended from | DVD |
Extended to |
|
ఈ పాలికార్బోనేట్ డిస్కు 120 millimetres (4.7 in) వ్యాసం, 1.2 millimetres (0.047 in) మందంతో, DVDలు, CD ల పరిమాణం లోనే ఉంటుంది. [3] సాంప్రదాయిక లేదా ప్రీ-BD-XL బ్లు-రే డిస్క్‌లలో ప్రతి లేయర్‌కు 25GB సామర్థ్యం ఉంటుంది. డ్యూయల్-లేయర్ డిస్క్‌లకు (50 GB) సామర్థ్యం ఉంటుంది. ట్రిపుల్-లేయర్ డిస్క్‌లు (100 GB), క్వాడ్రపుల్-లేయర్ డిస్క్‌లు (128 GB) కూడా అందుబాటులో ఉన్నాయి. [4]
హై-డెఫినిషన్ (HD) వీడియో బ్లు-రే డిస్క్‌లలో సెకనుకు 24 ప్రగతిశీల లేదా 50/60 ఇంటర్లేస్డ్ ఫ్రేమ్‌ల కలిగిన గరిష్టంగా 1920×1080 పిక్సెల్ రిజల్యూషన్‌తో నిల్వ చేయవచ్చు. DVD-వీడియో డిస్క్‌లు గరిష్ట రిజల్యూషన్ 480 (NTSC, 720×480 పిక్సెల్‌లు) లేదా 576 లైన్లకు పరిమితం చేయబడ్డాయి (CCIR 625/50, 720×576 పిక్సెల్‌లు, సాధారణంగా PAL తో ఉపయోగించబడుతుంది). [5] ఈ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్లతో పాటు, బ్లు-రే మల్టీమీడియా ఫార్మాట్ల సెట్‌తో అనుబంధించబడింది.
BD ఫార్మాట్‌ను బ్లు-రే డిస్క్ అసోసియేషన్ అభివృద్ధి చేసింది. వినియోగదారు ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్, చలన చిత్రాల తయారీదారులకు ఈ అసోసియేషను ప్రాతినిధ్యం వహిస్తుంది. సోనీ మొదటి బ్లు-రే డిస్క్ ప్రోటోటైప్లను 2000 అక్టోబరులో ఆవిష్కరించింది. మొదటి ప్రోటోటైప్ ప్లేయరు 2003 ఏప్రిల్‌లో జపాన్‌లో విడుదలైంది. తరువాత, హై-డెఫినిషన్ ఆప్టికల్ డిస్క్ ఫార్మాట్ యుద్ధం మొదలై, 2006 జూన్ 20 న అధికారికంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే వరకు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇక్కడ బ్లు-రే డిస్క్ HD DVD ఫార్మాట్‌తో పోటీపడింది. HD DVDకి మద్దతు ఇచ్చే ప్రధాన సంస్థ అయిన తోషిబా, 2008 ఫిబ్రవరిలో బ్లు-రే ఆధిక్యతను అంగీకరించి, [6] [7] 2009 చివరిలో తన స్వంత బ్లు-రే డిస్క్ ప్లేయర్‌ను విడుదల చేసింది. మీడియా రీసెర్చ్ ప్రకారం, యునైటెడ్ స్టేట్స్లో మొదటి రెండు సంవత్సరాలలో డివిడి సాఫ్ట్వేర్ అమ్మకాల కంటే హై-డెఫినిషన్ సాఫ్ట్వేర్ అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. [8] బ్లు-రే వీడియో ఆన్ డిమాండ్ (VOD), DVDల విక్రయాల నుండి పోటీని ఎదుర్కొంటుంది. [9] 2016 జనవరిలో, 44% US బ్రాడ్‌బ్యాండ్ కుటుంబాలు బ్లు-రే ప్లేయర్‌ని వాడుతున్నాయి. [10] 4K కంటెంట్ ప్లేబ్యాక్ కోసం, BDA Ultra HD Blu- ray అనే బ్లు-రే వేరియంట్‌ని పరిచయం చేసింది.
మొదటి BD-ROM ప్లేయర్లు (Samsung BD-P1000) 2006 జూన్ మధ్యలో మార్కెట్ లోకి వచ్చాయి. అయితే HD DVD ప్లేయర్ల ముందు అవి నిలవలేకపోయాయి. [11] [12] మొదటి బ్లు-రే డిస్క్ టైటిల్స్ 2006 జూన్ 20 న విడుదలయ్యాయి. అవి: 50 ఫస్ట్ డేట్స్, ది ఫిఫ్త్ ఎలిమెంట్, హిచ్, హౌస్ ఆఫ్ ఫ్లయింగ్ డాగర్స్, అండర్ వరల్డ్: ఎవల్యూషన్, xXx (అన్నీ సోనీ నుండే), MGM యొక్క ది టెర్మినేటర్. [13] ప్రారంభంలో MPEG-2 వీడియో కంప్రెషన్‌ను ఉపయోగించారు. ఆ పద్ధతినే ప్రామాణిక DVDలలో కూడా ఉపయోగించేవారు. కొత్త VC-1, AVC ఫార్మాట్లను ఉపయోగించి చేసిన డిస్కులను 2006 సెప్టెంబరులో ప్రవేశపెట్టారు. [14] 50GB డ్యూయల్-లేయర్ డిస్క్‌లను ని ఉపయోగించిన మొదటి సినిమాలు 2006 అక్టోబరులో [15] ప్రవేశపెట్టారు. మొదటి ఆడియో ఆల్బమ్‌లు 2008 మేలో విడుదలయ్యాయి.
2008 జూన్ నాటికి ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్లలో 2,500 పైగా బ్లు-రే డిస్క్ శీర్షికలు అందుబాటులో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, కెనడాల్లో 3,500 ఉన్నాయి. [16] జపాన్‌లో, 2010 జూలై నాటికి 3,300 కంటే ఎక్కువ శీర్షికలు విడుదలయ్యాయి [17]