రాంపూర్ (ఉత్తర ప్రదేశ్)
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం / From Wikipedia, the free encyclopedia
రాంపూర్ ఉత్తర ప్రదేశ్, రాంపూర్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. రాంపూర్ లోని గ్రంథాలయంలో 12,000 పైచిలుకు అరుదైన లిఖిత ప్రతులు, మొగలు కాలపు సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి.[2] పట్టణ పరిపాలనను మునిసిపాలిటీ నిర్వహిస్తుంది. రాంపూర్ గతంలో చక్కెర, నూలు కర్మాగాలకు ప్రసిద్ధి చెందింది.
త్వరిత వాస్తవాలు రాంపూర్, దేశం ...
రాంపూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 28.8°N 79.0°E / 28.8; 79.0 | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | రాంపూర్ |
ప్రాంతం | రోహిల్ఖండ్ |
డివిజన్ | మొరాదాబాద్ |
Named for | రాజా రాంసింగ్ |
Area | |
• Total | 84 km2 (32 sq mi) |
• Rank | 43 |
Elevation | 288 మీ (945 అ.) |
Population (2011) | |
• Total | 3,25,248 |
• Density | 3,900/km2 (10,000/sq mi) |
భాషలు | |
• అధికారిక | హిందీ[1] |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 244901 |
టెలిఫోన్ కోడ్ | 0595 |
లింగనిష్పత్తి | 1000/927 ♂/♀ |
మూసివేయి
2011 భారత జనగణన లెక్కల ప్రకారం రాంపూర్ జిల్లా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లా.[3]
2007 లో భారత ప్రభుత్వం రాంపూర్ జిల్లాను రాష్ట్రంలోని 14 'మైనారిటీ మతస్థులు అధికంగా గల' జిల్లాలలో ఒకటిగా గుర్తించింది. 2001 జనాభా లెక్కలలో జనాభా, సామాజిక-ఆర్థిక సూచికలు, ప్రాథమిక సౌకర్యాల సూచికలపై ఆధారపడి ఈ గుర్తింపు నిచ్చింది.[4] దీనిని నవాబుల నగరం అని కూడా పిలుస్తారు. రాంపూరి చాకు (కత్తి) కు ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది.