రేబిస్
కుక్క లేదా ఏదైనా జంతువు కరవడం వలన మనుషులకు వచ్చే ఒకానొక వ్యాధి / From Wikipedia, the free encyclopedia
రేబీస్ ను పిచ్చికుక్క వ్యాధి, జలభీతి వ్యాధి (హైడ్రోఫోబియా) అని కూడా అంటారు. ఇది క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఉదాహరణకు కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు, కోతులు, తదితర మాంసాహార జంతువులు (carnivorous), జబ్బుతో ఉన్న జంతువు మనిషికి కరిచినచో ఈ వ్యాధి మనుషులలో వ్యాప్తిచెందును. జంతువులలోనైనా, మనుషులలోనైనా ఈ వ్యాధి కనిపిస్తే చనిపోవడం తప్ప మందులేదు. పిచ్చికుక్క కరిచిన వెంటనే టీకాలు (వ్యాక్షిన్) వేసుకుంటే ప్రమాదమేమీ ఉండదు. నూటికి నూరుపాళ్లు సురక్షితము.
త్వరిత వాస్తవాలు రేబీస్ వైరస్, Virus classification ...
రేబీస్ వైరస్ | |
---|---|
Virus classification | |
Group: | Group V ((−)ssRNA) |
Order: | మోనోనెగావైరేల్స్ |
Family: | రాబ్డో వైరిడే |
Genus: | లిస్సా వైరస్ |
Type species | |
రేబిస్ వైరస్ |
మూసివేయి