రొమేనియా
From Wikipedia, the free encyclopedia
రొమేనియా లేక రొమానియా (పురాతన ఉఛ్ఛారణలు: రుమానియా, రౌమానియా) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశము. దేశప్రధాన సరిహద్దు దేశాలలో ఉత్తరాన ఉక్రెయిన్, దక్షిణాన బల్గేరియా, తూర్పున మోల్డోవా, పశ్చిమాన హంగేరీ, సెర్బియాలు ఉన్నాయి.దేశం నల్లసముద్రం తీరంలో ఉంది.దేశవైశాల్యం 238397 చ.కి.మీ. దేశంలో టెంపరేట్ కాంటినెంటల్ వాతావరణం ఉంటుంది. దేశజనసంఖ్య 20 మిలియన్లు.యురేపియన్ యూనియన్లో జనసాంధ్రతలో 7 వ స్థానంలో ఉంది.దీని రాజధాని, అతిపెద్ద నగరం అయిన " బుకరెస్ట్ " వైల్యపరంగా యురేపియన్ యూనియన్లో 6వ స్థానంలో ఉంది.2014 గణాంకాల ఆధారంగా బుకరెస్ట్ నగర జనసంఖ్య 18,83,425.[2]
రొమేనియా | ||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం Deşteaptă-te మేలుకో, రొమేనియన్! |
||||||
Location of Romania (orange) – on the European continent (camel & white) |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | బుచారెస్ట్ (బుకురెష్టి (Bucureşti)) 44°25′N 26°06′E | |||||
అధికార భాషలు | రొమేనియన్1 | |||||
జాతులు | 89.5% రొమేనియన్లు, 6.6% హంగేరియన్లు, 2.5% రోమా, 1.4% other minority groups | |||||
ప్రజానామము | రొమేనియన్ | |||||
ప్రభుత్వం | ఏకీకృత అర్ధ-అధ్యక్షతరహా రిపబ్లిక్ | |||||
- | అధ్యక్షుడు | క్లాస్ Iohannis | ||||
- | ప్రధానమంత్రి | విక్టర్ పోంట | ||||
ఏర్పడుట | ||||||
- | ట్రాన్సిల్వేనియా | 10వ శతాబ్దం | ||||
- | వల్లాచియా | 1290 | ||||
- | మోల్దావియా | 1346 | ||||
- | మొదటి ఏకీకరణ | 1599 | ||||
- | వాలాచియా & మోల్డావియ పునరేకీకరణ | January 24, 1859 | ||||
- | Officially recognised independence | July 13, 1878 | ||||
- | Reunification with ట్రాన్సిల్వేనియా | December 1, 1918 | ||||
Accession to the European Union |
January 1, 2007 | |||||
- | జలాలు (%) | 3 | ||||
జనాభా | ||||||
- | జూలై 2008 అంచనా | 22,246,862 (50వది) | ||||
- | 2002 జన గణన | 21,680,974 | ||||
జీడీపీ (PPP) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $245.847 billion[1] (41st) | ||||
- | తలసరి | $11,400[1] (64వది) | ||||
జీడీపీ (nominal) | 2007 అంచనా | |||||
- | మొత్తం | $165.983 billion[1] (38వది) | ||||
- | తలసరి | $7,697[1] (58వది) | ||||
జినీ? (2003) | 31 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2005) | 0.825 (high) (62nd) | |||||
కరెన్సీ | ల్యూ (RON ) |
|||||
కాలాంశం | EET (UTC+2) | |||||
- | వేసవి (DST) | EEST (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .ro | |||||
కాలింగ్ కోడ్ | +40 | |||||
1 Other languages, such as Hungarian, German, Romani, Croatian, Ukrainian and Serbian, are official at various local levels. 2 Romanian War of Independence. 3 Treaty of Berlin. |
ఐరోపా రెండవ అతి పొడవైన నది డానుబే నది జర్మనీలో పుట్టి 2,857 km (1,775 మై) ఆగ్నేయ దిశలో ప్రవహిస్తుంది. ఇది రొమేనియా డానుబే ముఖద్వారానికి చేరి సముద్రంలో సంగమించే ముందు పది దేశాల గుండా ప్రవహిస్తుంది. ఉత్తరం నుండి నైరుతి వరకు రోమేనియాలో విస్తరించి రోమేనియాను దాటి కార్పతియన్ పర్వతాలు మోల్దోవాలో ప్రవేశిస్తాయి. ఈపర్వతాల అత్యున్నత శిఖరం ఎత్తు 2,544 మీ (8,346 అడుగులు) వద్ద ఉన్నాయి.[3]
మోల్డావియా, వాలచియా డానుబేయన్ ప్రిన్సిపాలిటీల పర్సనల్ యూనియన్ ద్వారా ఆధునిక రోమానియా 1859 లో ఏర్పడింది. 1866 నుండి అధికారికంగా రోమానియా అని పేరు పెట్టబడింది. 1877 లో ఒట్టోమన్ సామ్రాజ్యం నుండి స్వతంత్రం పొందింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగింపులో ట్రాన్సిల్వానియా బుకోవినా, బెస్సరేబియా రోమానియా సార్వభౌమ రాజ్యంతో విలీనం చేయబడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1944 వరకు వేర్మ్చత్తో పోరాడుతూ ఇది మిత్రరాజ్యాల శక్తులలో చేరి రెడ్ ఆర్మీ దళాల ఆక్రమణను ఎదుర్కొని రోమానియా అనేక భూభాగాలను కోల్పోయింది. యుద్ధం తర్వాత తిరిగి నార్తరన్ ట్రాన్సిల్వేనియా పొందింది. యుద్ధం తరువాత రొమేనియా ఒక సామ్యవాద గణతంత్రం, వార్సా ఒప్పందం సభ్యదేశంగా మారింది. 1989 విప్లవం తరువాత రొమేనియా ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థపై పరివర్తన చెందడం ప్రారంభించింది.
రోమానియా ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, ఐరోపా సమాఖ్యలో అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉంది. మానవ అభివృద్ధి సూచికలో 50 వ స్థానాన్ని పొందింది.[4][5] 2000 ల ఆరంభంలో వేగవంతమైన ఆర్థికాభివృద్ధి తరువాత రోమేనియా ఆర్థికరంగం ప్రధానంగా సేవలపై ఆధారపడింది. యంత్రాలు, విద్యుత్ శక్తి ఉత్పత్తి, నికర ఎగుమతి, ఆటోమొబైల్ డేసియా, ఓఎంవి పెట్రోమ్ వంటి కంపెనీలు ఆర్థికరంగాన్ని బలోపేతం చేస్తూ ఉన్నాయి. ఇది 2004 నుండి నాటో సభ్యదేశంగా ఉంది. 2007 నుండి యురోపియన్ యూనియన్లో భాగంగా ఉంది. జనాభాలో అధిక సంఖ్యలో తాము తూర్పు సాంప్రదాయ క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. రోమేనియన్లు రోమన్స్ భాషను మాట్లాడతారు. రోమానియా సాంస్కృతిక చరిత్ర తరచూ ప్రభావశీలురైన కళాకారులు, సంగీతకారులు, పెట్టుబడిదారులు, క్రీడాకారులతో సంబంధితమై ఉంది.
2007జనవరి 1 నుండి రొమేనియా ఐరోపా సమాఖ్యలో సభ్యదేశంగా ఉంటోంది. ఐరోపా సమాఖ్య సభ్యదేశాలలో రొమేనియా వైశాల్యం రీత్యా తొమ్మిదవ స్థానంలో, జనాభా రీత్యా ఏడవ స్థానంలో ఉంది. 19 లక్షల జనాభాతో ఐరోపా సమాఖ్యలోని ఆరవ అతిపెద్ద నగరంగా ఉంది. 2007లో రొమేనియాలోనే ఉన్న సిబియు నగరం ఐరోపా సాంస్కృతిక రాజధానిగా ఎంపిక చేయబడింది. మార్చి 29, 2004 నుండి రొమేనియా నాటో సభ్యదేశంగా కొనసాగుతోంది.