ర్యూజిన్
From Wikipedia, the free encyclopedia
ర్యూజిన్ (龍神), కొన్ని సంప్రదాయాలలో, జపనీస్ పురాణాలలోని ఇష్ట దైవమైన ఓవటట్సుమీ(Ōwatatsumi)తో సమానంగాకనిపించే సముద్రపు దేవుడు. అనేక పాఠాంతరాల్లో, ర్యూజిన్ కి మానవ ఆకారంలోకి మారగల సామర్థ్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలామంది అతనికి ఔషధాల మీద జ్ఞానం కూడా ఉందని నమ్ముతారు, అలాగే అతన్ని వర్షాన్ని, ఉరుములను రప్పించే వ్యక్తిగా భావిస్తారు. ర్యూజిన్ అనేక కుటుంబ సమూహాలకు కులదైవం (ఉజిగామి) కూడా. [1] [2]
ర్యూజిన్ | |
---|---|
ర్యూజిన్ ఆభరణాన్ని దొంగిలిస్తున్న యువరాణి టమటోరి- ఉటగావా కునియోషి వర్ణ చిత్రం |
సముద్రపు శక్తిని సూచించే పెద్ద నోరుతో ఉండే ఈ జపనీస్ డ్రాగన్ ని జపాన్ వారు మంచి దేవుడి గా, పోషకుడిగా పరిగణిస్తారు. ఎందుకంటే, వారు సహస్రాబ్దాలుగా సముద్రపు అనుగ్రహంతో జీవిస్తున్నారు. ర్యూజిన్, కుబ్లాయ్ ఖాన్ పంపిన మంగోలియన్ యుద్ధనౌకల గుంపును హరికేన్ తో ముంచెత్తి సవాలును ఎదుర్కున్న ధీరుడిగా ఘనత పొందాడు. ర్యూజిన్ నివాసం ర్యూగూ-జో (Ryūgū-jō) , సముద్రం అడుగున ఎరుపు, తెలుపు రంగు పగడాలతో నిర్మితమైన రాజభవనం. అక్కడి నుండే అతను అద్భుత పోటు ఆభరణాలతో అలలను నియంత్రిస్తాడు. తరచుగా సముద్ర తాబేళ్లు, చేపలు, జెల్లీ ఫిష్, పాములు, ఇతర సముద్ర జీవులు ర్యుజిన్ సేవకులుగా కనిపిస్తాయి. [3] [4]