నేనిక్కడ తొంభయ్యేడో వాణ్ణి. ఒకప్పుడు నిర్వాహకుణ్ణి, అధికారినీ. చురుగ్గా పాల్గొనలేక పోవడం వలన 2023 జూన్ 3 న స్వచ్ఛందంగా ఈ బాధ్యతల నుండి తప్పుకున్నాను. 2005 జూలై 30 న తెవికీలో తొలి దిద్దుబాటు చేసాను. అప్పట్లో విక్షనరీలో కొంత పని చేసాను. వికీలో నాణ్యత పెంచడం కోసం కృషి చేస్తూంటాను. వేగంగా పని చేసేందుకు ఇష్టపడతాను. అందుకే వాడుకరి:ChaduvariAWBNew పేరుతో సెమీ-ఆటో దిద్దుబాట్లు చేస్తూంటాను.
కృషి షో కేసు |
- సహాయం పేజీలు, వికీ వ్యవహార జ్ఞానానికి సంబంధించిన పేజీల్లో దాదాపు 75% పేజీలను సృష్టించాను, సమాచారం చేర్చాను. (2006 నుండి)
- వికిపీడియా ఇంటర్ఫేసును తెలుగు లోకి అనువదిస్తూంటాను. (2008 నుండి)
- వ్యాసాల్లో ఉండే ఎర్రలింకులను సవరించే ప్రాజెక్టు సృష్టి, నిర్వహణ. (2022)
- ఫొటోల చేర్పు పోటీలో తెవికీ 3 వ స్థానం సాధించడంలో తోడ్పాటు (2021)
- కొత్త వాడుకరుల కోసం గ్రోత్ ప్రాజెక్టు స్థాపన (2021)
- వికీపీడియా గణాంకాల సంకలన, వ్యవకలనాలు సృష్టించాను (2020)
- నిర్వాహకులు చేసే నిరోధ నిర్ణయాలను సమీక్షించే సంఘాన్ని ప్రతిపాదించాను (2020)
- వికీ పద్ధతులు, సాంకేతికాంశాలపై సూచనలిచ్చే పేజీ (2020)
- వికీలో వేరే పనులు పనిచేస్తూ కూడా నిర్వాహక కృషి చేయని నిర్వాహకుల హక్కుల ఉపసంహరణ విధానాన్ని ప్రతిపాదించాను. (2019)
- భాష నాణ్యత కోసం ఐదొందలకు పైగా రెగెక్సులు రాసాను (2016 నుండి)
- వ్యాసాల నాణ్యతను గణించే మంచి వ్యాసాల ప్రమాణాలను రూపొందించడంలో తోడ్పడ్డాను (2018)
- భాషాంతక అనువాదాలపై, భాషా వ్యతిరేక చర్యలపై పోరాటం (2016 నుండి)
- మూడు వేల మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టు నిర్వహణ, అందులో భాగంగా, స్వయంగా 900 మొలకల విస్తరణ. (2020)
- గ్రామాల పేజీల్లో జనగణన సమాచారం కూర్పు, చేర్పు (2017, 2018)
- క్రికెట్ 2023 ప్రాజెక్టు ద్వారా 2,250 కొత్త క్రికెట్ వ్యాసాలు చేరాయి. అందులో నేను 558 వ్యాసాలు చేర్చాను
|
ChaduvariAWB, ChaduvariAWBNew, GrowthChaduvari1, GrowthChaduvari2, GrowthChaduvari3, GrowthChaduvari4 - ఈ ఖాతాలు నావే |
| 2024 మే 22 15:35:01 నాటికి, లక్షకు చేరేందుకు ఇంకా కావాల్సిన వ్యాసాలు: 4412 |
|
Chaduvari ప్రస్తుతం చిన్న తెవికీ సెలవు తీసుకున్నాడు, తొందరలోనే, మరలా వికీపీడియాలో తన మార్పులు-చేర్పులు మొదలు పెడతాడు. ఈ సందేశం ఉన్నంతవరకు చర్చలలో పాల్గొనడు. |