షీనా భాష
షీనా భాష అనేది షీనా ప్రజలు మాట్లాడే ఇండో - ఆర్యన్ భాష. / From Wikipedia, the free encyclopedia
షీనా భాష అనేది షీనా ప్రజలు మాట్లాడే ఇండో - ఆర్యన్ భాష. పాకిస్తాన్లో, ప్రధానంగా పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న గిల్గిత్-బాల్టిస్తాన్, భారతదేశంలోని లడఖ్, కాశ్మీర్ లలో నివసిస్తున్న 1,146,000 మంది ప్రజలు మాట్లాడే ప్రధాన భాష.[4][5] ఇది ఇండో- ఆర్యన్ భాషా కుటుంబంలోని ఇండో-ఇరానియన్ భాషా ఉపకుటుంబానికి చెందిన ఇండో-ఆర్యన్ శాఖకు చెందినది. ఈ భాష టార్డిక్ భాషలలో ఒకటిగా వర్గీకరించబడింది .
త్వరిత వాస్తవాలు షీనా, ఉచ్ఛారణ ...
షీనా | |
---|---|
ݜݨیاٗ Ṣiṇyaá | |
ఉచ్ఛారణ | సింజా |
స్థానిక భాష | పాకిస్తాన్, భారతదేశం |
ప్రాంతం | గిల్గిత్-బాల్టిస్తాన్, కోహిస్తాన్ డిస్ట్రిక్ట్, ద్రాస్, లడఖ్, గురేజ్ |
స్వజాతీయత | షీనా ప్రజలు |
స్థానికంగా మాట్లాడేవారు | 7,20,200 షీనా (2018)[1] షీనా, కోహిస్తాని 458,000 (2018)[2] |
భాషా కుటుంబం | ఇండో-యూరోపియన్
|
వ్రాసే విధానం | అరబిక్ లిపి [3] |
భాషా సంకేతాలు | |
ISO 639-3 | Either:scl – ప్రామాణిక షీనాplk – కోహిస్తానీ షీనా |
Glottolog | 1264 షిన్ 1264 షీనాకోహి1248 కోహిస్తానీ షీనా |
ముదురు నారింజ రంగులో షీనా భాష పంపిణీ |
మూసివేయి
ఈ భాష మాట్లాడే ప్రాంతాలలో పాకిస్తాన్-నియంత్రిత ప్రావిన్సులలో అస్టోర్, చిలాస్, డారెల్, టాంగీర్, గిల్గిట్, ఘిజర్, బాల్టిస్తాన్, కోహిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. దీనిని భారతదేశ నియంత్రణలో ఉన్న గురేజ్, ద్రాస్, కార్గిల్లో మాట్లాడతారు. 1981లో ఈ భాషని మొత్తం దాదాపు 3,21,000 మంది మాట్లాడినట్లు అంచనా.