సంస్థాగత సిద్ధాంతం
From Wikipedia, the free encyclopedia
సంస్థాగత సిద్ధాంతం (ఆంగ్లం: Organizational Theory) సంస్థాగత విశ్లేషణని అవగతం చేసే విభిన్న నేపథ్యముల, ప్రశ్నల, పద్ధతుల, వివరణాత్మక రీతుల సమాహారం.
ఇది కేవలం ఒకే ఒక సిద్ధాంతం కాదు. డ్వైట్ వాల్డో అనబడే రాజకీయ శాస్త్రవేత్త 1978లో ఒక పరిశోధనలో ఈ విధంగా సమీక్షించాడు. "సంస్థాగత సిద్ధాంతం పోకడలతో, భిన్నత్వంతో, వాదప్రతివాదాలతో వర్ణించబడింది." అప్పటి నుండి సంస్థాగత సిద్ధాంతంలో అంతరం, సైద్ధాంతికంగా, ఆచరణలో పెరుగుతూనే వచ్చింది.
సంస్థలు స్థాపించబడగనే చాలా మంది ఏ రకమైన సంస్థలు అయితే ఉత్తమంగా ఉంటాయి అనే అంశంపై ప్రయోగాలు జరిపారు. వీటిలో ముఖ్యమైనవి:
- ఆడం స్మిత్ చే ప్రతిపాదించబడిన శ్రమ విభజన
- మ్యాక్స్ వెబర్ చే ప్రతిపాదించబడిన ఉద్యోగస్వామ్యం
- ఫ్రెడరిక్ విన్స్లో టేయ్లర్ చే ప్రతిపాదించబడిన శాస్త్రీయ నిర్వహణ
- ఎల్టన్ మేయో అతని సహోద్యోగులు విస్తృతంగా పరిశోధనలు చేసిన హాథోర్న్ అధ్యయనాలు
- ఇతర శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపిన ఆలంబన సిద్ధాంతం