సియాటెల్
From Wikipedia, the free encyclopedia
సియాటెల్ అమెరికాలోని పశ్చిమతీర నౌకాశ్రయ నగరాలలో ఒకటి, కింగ్ కౌటీ కౌంటీ స్థానంగా ఉంది. 2015 గణాకాల ఆధారంగా నగరజనసంఖ్య 6,84,451.[3] ఉత్తర అమెరికా పసిఫిక్ వాయవ్య ప్రాంతంలోను, యు.ఎస్. స్టేట్ వాషింగ్టన్లలోనూ సియాటెల్ అతిపెద్ద నగరం. 2013 జూలైలో యునైటెడ్ స్టేట్స్లో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా సియాటెల్ గుర్తింపు పొందింది.[7] అలాగే 2015 మే గణాంకాలను అనుసరించి 2.1% అభివృద్ధితో సియాటెల్ యునైటెడ్ స్టేట్స్‌లోని టాప్ 5 నగరాలలో ఒకటిగా గుర్తించబడింది.[8] యునైటెడ్ స్టేట్స్ లోని (మహానగర ప్రాంతం) మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 3.7 మిలియన్ల జనసంఖ్య కలిగిన సియాటెల్ 15వ స్థానంలో ఉంది.[9] సియాటెల్ నగరం పుగెట్ సౌండ్, వాషింగ్టన్ సరోవరం మద్య ఉంది. నగరం కెనడా దేశ నైరుతీ సరిహద్దు ప్రాంతం, యునైటెడ్ స్టేట్స్ వాయవ్య సరిహద్దు ప్రాంతంలో ఉంది. ఉత్తర అమెరికా నౌకాశ్రయాలలో మూడవస్థానంలో ఉన్న సియాటెల్, ఆసియా ప్రధాన వాణిజ్య కేంద్రాలలో ఒకటి.[10] సియాటెల్ ప్రాంతానికి యురోపియన్లు ప్రవేశించక ముందు ఈ ప్రాంతంలో 4,000 సంవత్సరాల ముందుగానే స్థానిక అమెరికన్లు నివసించారు.[11] 1851 నవంబరు 13న ఆర్థర్ ఏ.డెన్నీ, ఆయన బృందం (డెన్నీ పార్టీ) స్కూనర్ షిప్లో ప్రయాణించి ఇలినాయిస్ నుండి పోర్ట్లాండ్, అరెగాన్ మీదుగా ప్రయాణించి సియాటెల్ లోని అల్కి పాయింట్ చేరుకున్నారు.[12] 1852లో తమ స్థావరాన్ని తూర్పుతీరంలోని ఎలియాట్ బేకు తరలించి దానికి సియాటెల్ అని పేరు పెట్టారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న దువామిష్, స్క్వామిష్ గిరిజన ప్రజల ప్రతినిధి సియాటెల్ జ్ఞాపకార్ధం ఈ పేరు నిర్ణయించారు. సియాటెల్‌లో కొయ్య తయారీ మొదటి ప్రధాన పరిశ్రమగా ఉండేది. తరువాత వాణిజ్య మయమై నౌకానిర్మాణ రంగం అభివృద్ధి చెందింది. నౌకానిర్మాణం 1910 గోల్డ్ రష్ సమయంలో అలాస్కా చేరడానికి మార్గం సుగమం చేసింది.
Seattle, Washington
| |
---|---|
City | |
Etymology: Chief Si'ahl | |
Nickname: The Emerald City / The Jet City / Rain City | |
Motto: The City of Flowers / The City of Goodwill | |
Country | United States |
State | Washington |
County | King |
Incorporated | December 2, 1869 |
Government | |
• Type | Mayor–Council |
• Body | Seattle City Council |
• Mayor | Ed Murray |
• Deputy mayor | Hyeok Kim and Kate Joncas |
Area | |
• City | 142.5 sq mi (369.2 km2) |
• Land | 83.87 sq mi (217.2 km2) |
• Water | 58.67 sq mi (152.0 km2) |
• Metro | 8,186 sq mi (21,202 km2) |
Highest elevation | 520 అ. (158 మీ) |
Lowest elevation | 0 అ. (0 మీ) |
Population | |
• City | 6,08,660 |
• Estimate (2015)[3] | 6,84,451 |
• Rank | US: 18th |
• Density | 8,161/sq mi (3,151/km2) |
• Urban | 30,59,393 (US: 14th) |
• Metro | 37,33,580 (US: 15th) |
• CSA | 44,59,677 (US: 13th) |
Demonym | Seattleite |
Time zone | UTC−8 (PST) |
• Summer (DST) | UTC−7 (PDT) |
ZIP codes | |
Area code | 206 |
FIPS code | 53-63000 |
GNIS feature ID | 1512650[6] |
Website | Seattle.gov |
దేశంలోని 25 పెద్ద నగరాలలో సియాటెల్ నగరం ఒకటి.[13] అయినప్పటికీ "గ్రేట్ డిప్రెషన్ " సమయంలో సియాటెల్ ఆర్థికరంగం తీవ్రంగా పతనం అయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సియాటెల్ నగరంలో బోయింగ్ విమానాల తయారీ కంపెనీ స్థాపినడంతో సియాటెల్ ఆర్థికరంగం తిరిగి కోలుకుంది. 1980లో మైక్రోసాఫ్ట్ వంటి సాంకేతిక కంపెనీలు స్థాపించబడిన తరువాత సియాటెల్ నగరం సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చెందడం ఆరంభం అయింది. 1994 లో సియాటెల్ నగరంలో ఇంటర్నెట్ రిటైలర్ " అమెజాన్.కామ్" స్థాపించబడింది. సాఫ్ట్వేర్, బయోటెక్నాలజీ, ఇంటర్నెట్ కంపెనీలు ఆర్థికాభివృద్ధికి దారితీసాయి. ఫలితంగా 1900-2000 మద్య నగర జనాభా దాదాపు 50,000 పెరిగింది. 1918 - 1951 మద్యకాలంలో జాక్సన్ వీధి (ప్రస్తుత చైనా టౌన్) సెంట్రల్ డిస్ట్రిక్ట్‌లో దాదాపు 2 డజన్ల జాజ్ నైట్ క్లబ్బులు ఆరంభించబడ్డాయి. జాజ్ సంగీతంలో రే చార్లెస్, క్వింసీ జోంస్, ఎర్నిస్టిన్ ఆండర్సన్, ఇతరులు ప్రాబల్యం సంపాదించారు. రాక్ సంగీత కళాకారుడు జిమీ హెండ్రిక్స్, గ్రునే సియాటెల్ నగరంలో జన్మించారు.[14]