చార్లెస్ డార్విన్
బ్రిటీష్ నేషనలిస్ట్ / From Wikipedia, the free encyclopedia
చార్లెస్ రాబర్ట్ డార్విన్ (1809 ఫిబ్రవరి 12 – 1882 ఏప్రిల్ 19) ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది. డార్విన్, ఒక ప్రకృతి శాస్త్రవేత్తగా, జియాలజిస్టుగా, బయాలజిస్టుగా, రచయితగా ప్రసిద్ధుడు. ఒక వైద్యుని వద్ద సహాయకుడిగాను, రెండేళ్ళ పాటు వైద్య విద్యార్థిగాను ఉన్న డార్విన్, ఆధ్యాత్మిక విద్య చదువుకున్నాడు. జంతు చర్మాల్లో గడ్డి లాంటి వాటిని కూరి వాటిని బ్రతికున్నవి లాగా కనబడేలా చేసే పనిలో శిక్షణ పొందాడు.</ref> ఇతను, భూమిపై జీవజాలము ఏ విధంగా పరిణామక్రమం చెందినది అనే విషయంపై పరిశోధనలు చేసి, జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[1] అతని పేరును తలుచుకుంటే చాలు ఎవరికైనా సరే వెనువెంటనే గుర్తుకు వచ్చేది పరిణామ సిద్ధాంతం. ప్రకృతిలో జీవజాతులు తమ ఉమ్మడి పూర్వీకుల నుంచి క్రమానుగతంగా పరిణామం చెందుతూ ఏర్పడ్డాయని డార్విన్ వివరించాడు. ఈ సిద్ధాంతం సర్వత్రా ఆమోదం పొందింది. విజ్ఞాన శాస్త్రంలో దీన్ని ఒక మౌలికమైన భావనగా భావిస్తారు.[2][3]
ఛార్లెస్ డార్విన్ | |
---|---|
జననం | (1809-02-12)1809 ఫిబ్రవరి 12 మౌంట్ హౌస్, ష్ర్యూస్బరి, ష్రోప్షైర్, ఇంగ్లాండు |
మరణం | 1882 ఏప్రిల్ 19(1882-04-19) (వయసు 73) డౌన్హౌస్, డౌనే, కెంట్, ఇంగ్లాండు |
నివాసం | ఇంగ్లాండు |
జాతీయత | బ్రిటిష్ |
రంగములు | ప్రకృతివేత్త |
వృత్తిసంస్థలు | రాయల్ జియోగ్రాఫికల్ సొసైటి |
చదువుకున్న సంస్థలు | ఎడిన్బరో యూనివర్శిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటి |
విద్యా సలహాదారులు | ఆడమ్ సెగ్విక్ జాన్ స్టీవెన్స్ హెన్స్లో |
ప్రసిద్ధి | బీగిల్ ఓడపై ప్రయాణం ఆన్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ సహజ ఎంపిక |
ప్రభావితం చేసినవారు | చార్లెస్ లియెల్ |
ప్రభావితులు | థామస్ హెన్రీ హక్స్లీ జార్జి జాన్ రోమనెస్ |
ముఖ్యమైన పురస్కారాలు | రాయల్ మెడల్ (1853) వొల్లాస్టన్ మెడల్ (1859) కోప్లే మెడల్ (1864) |
సంతకం | |
గమనికలు అతడు ఎరాస్మస్ డార్విన్ మనవడు, జోసియా వెడ్జ్వుడ్ మనవడు ఎమ్మా వెడ్జ్వుడ్ను పెళ్ళి చేసుకున్నాడు. |
ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ తో కలసి ప్రచురించిన పరిశోధనా పత్రంలో అతను, తన శాస్త్రీయ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం, ప్రకృతివరణం అని పిలిచే ఒక ప్రక్రియ వల్ల ఈ శాఖలుగా చీలడం జరుగుతూ వచ్చింది.[4]