వికీపీడియా:నిర్ధారత్వం
From Wikipedia, the free encyclopedia
ఏదైనా విషయాన్ని వికీపీడియాలో వ్రాయవచ్చునా అనే సమస్యకు ప్రామాణికత - నిజం మాత్రమే కాదు, నిర్ధారింప తగినది (verifiability, not truth). అంటే వికీపీడియాలో ఉంచిన విషయాలు ఇంతకు ముందే విశ్వసనీయమైన ప్రచురణలలో వెలువడి ఉండాలి. ఇది నిజం అనుకుంటే చాలదు. ముఖ్యంగా వివాదాస్పదం కావచ్చుననిపించే విషయాలకు, లేదా ఇతరులు ప్రశ్నించిన విషయాలకు విశ్వసనీయమైన మూలాలు చూపడం చాలా అవుసరం. అలా చూపలేని పక్షంలో ఆ విషయాలను తొలగించాలి ({{fact}} (ఆధారం చూపాలి అని వస్తుంది) అనే మూస తగిలించి వదిలేస్తే చాలదు.)
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
సంక్షిప్తంగా ఈ పేజీలోని విషయం: ప్రశ్నింపబడిన, లేదా ప్రశ్నింపబడే అవకాశం ఉన్న విషయాలన్నింటికీ, మరియు కొటేషన్లకు విశ్వసనీయమైన, ఇంతకుముందు ప్ చూపాలి |
వికీపీడియా:నిర్ధారింప తగినది అనేది వికీపీడియా రచనలకు వర్తించే మూడు మౌలిక సూత్రాలలో ఒకటి. తక్కిన రెండు వికీపీడియా:తటస్థ దృక్కోణం మరియు వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం - ఈ మూడు సూత్రాలు వికీపీడియాలో ఉంచదగిన విషయం మౌలిక పరిధులను నిర్దేశిస్తాయి. ఈ మూడు సూత్రాలను దేనికదే విడివిడిగా కాక సంయుక్తంగా, విచక్షణతో అమలు చేయాలి.