కీర్తిపూర్
From Wikipedia, the free encyclopedia
కీర్తిపూర్, నేపాల్ లోని ఒక పురాతన నగరం. నెవార్లు కీర్తిపూర్ స్థానికులు. కీర్తిపూర్ నగరం కిరాత్ రాజు యలంబర్ నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇది ఖాట్మండు లోయలో ఉంది, ఖాట్మండు నగరానికి నైరుతిలో 5 కి.మీ.దూరంలో ఉంది.[1] లోయ లోని ఐదు పురపాలక సంఘాలలో ఇది ఒకటి. మిగిలినవి ఖాట్మండు, లలిత్పూర్, భక్తపూర్, మధ్యపూర్ తిమి. సందర్శించడానికి అత్యంత ప్రసిద్ధి చెందిన హిందూ ఆలయాల ప్రదేశాలలో కీర్తిపూర్ ఒకటి. దేవాలయాలను సందర్శించేందుకోసమే కాకుండా సహజ వాతావరణం ఆస్వాదించటనికి చాలామంది ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.[2] ఈ నగరం, 2008లో యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. [3] త్రిభువన్ విశ్వవిద్యాలయం ఉన్నందున, కీర్తిపూర్ పట్టణం వెలుపల ఉన్న విద్యార్థులు, అధ్యాపకులకు ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి ఒక ప్రసిద్ధ ప్రాంతంగా అభివృద్ధి చెందింది.
త్వరిత వాస్తవాలు కీర్తిపూర్ कीर्तिपुर, దేశం ...
కీర్తిపూర్
कीर्तिपुर | |
---|---|
Motto: झीगु किपू समृद्ध किपू | |
Coordinates: 27°40′41″N 85°16′37″E | |
దేశం | Nepal |
ప్రాంతం | భాగమతి |
జిల్లా | ఖాట్మండు |
Government | |
• మేయర్ | రమేష్ మహర్జన్, (ఎన్.సి.పి.) |
• డిప్యూటీ మేయర్ | సరస్వతీ ఖడ్కా, (ఎన్.సి.పి.) |
Population (2011) | |
• Total | 67,171 |
Time zone | UTC+5:45 (ఎన్.ఎస్.టి) |
పిన్కోడ్ | 44618 |
Area code | 01 |
Website | www.kirtipurmun.gov.np |
మూసివేయి