భూ నిమ్న కక్ష్య
భూమికి అత్యంత దగ్గరగా ఉండే భూకేంద్రక కక్ష్య / From Wikipedia, the free encyclopedia
2000 కి.మీ ఎత్తు లేదా అంతకన్నా తక్కువ ఎత్తులో ఉండే భూ కక్ష్యను భూ నిమ్న కక్ష్య అంటారు. ఇంగ్లీషులో దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ (LEO) అంటారు. 200 కి.మీ కన్నా తక్కువ ఎత్తులోని ఉపగ్రహాల కక్ష్యా పతనాన్ని కూడా లెక్కలోని తీసుకొంటే, భూ నిమ్న కక్ష్య నిర్వచనంగా అందరూ అంగీకరించే నిర్వచనం- "భూ ఉపరితలం పైన 160 కి.మీ ఎత్తు (భ్రమణ కాలం - 88 నిమిషాలు) నుండి 2000 కి.మీ ఎత్తు (భ్రమణకాలం - 127 నిమిషాలు) మధ్య ఉపగ్రహాలు పరిభ్రమించే కక్ష్య".[1][2]అపోలో చంద్రయాత్ర తప్పితే, మానవ సహిత రోదసీయాత్రలన్నీ భూ నిమ్న కక్ష్య లోనే జరిగాయి. మానవసహిత అంతరిక్ష స్థావరాలతో సహా, కృత్రిమ ఉపగ్రహాలలో చాలావరకూ ఈ కక్ష్య లోనే ఉన్నాయి.