మంత్రి (ప్రభుత్వం)
జాతీయ లేదా ప్రాంతీయ ప్రభుత్వంలో సాధారణంగా మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహిస్తాడు / From Wikipedia, the free encyclopedia
మంత్రి (Minister) అనే పదం పూర్వకాలం నుండి వాడబడుతుంది.రాచరికాలు,రాజ్యాలు ఉండే పూర్వకాలంలో ఉన్నప్పుడు మంత్రిని అమాత్యులు, రాజప్రతినిధి, దివాను అని వ్యవహరించేవారు.వీరు మహారాజుకు ముఖ్యమైన సలహాదారుడుగా ఉండేవాడు.దానికి ఉదాహరణగా మహామంత్రి తిమ్మరుసును చెప్పుకోవచ్చు. సంబోధనా పదం ' అమాత్యా ' అని సంబోదించేవారు.వివిధ రంగాలకు వివిధ మంత్రులు లేదా అమాత్యులు వుండేవారు.ప్రధానమైన మంత్రిని మహామంత్రి అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో కేంధ్రప్రభుత్వంలో ప్రధాన మంత్రి,రాష్ట్ర ప్రభుత్వాలలో ముఖ్యమంత్రి అని వ్యవహరింపబడుతుంది.వివిధ విభాగాలకు ఉన్న మంత్రులు ప్రదాన మంత్రి, ముఖ్యమంత్రి అదీనం క్రింద వారికి కేటాయించిన శాఖల పరిపాలనపై నియంత్రణాధికారం కలిగి ఉంటారు. రాష్ట్రప్రభుత్వాలకు చెందిన మంత్రులను రాష్ట్ర మంత్రులని,కేంద్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులను కేంద్ర మంత్రులు అని అంటారు.