లాట్వియా
From Wikipedia, the free encyclopedia
లాట్వియా (అధికార నామము రిపబ్లిక్ ఆఫ్ లాట్వియా) ఉత్తరఐరోపాలో బాల్టిక్ సముద్ర తీరాన ఉన్న మూడు దేశాలలో ఇది ఒక దేశము.[4] ఈ దేశానికి ఉత్తరసరిహద్దులో ఎస్టోనియా, దక్షిణసరిహద్దులో లిథువేనియా, తూర్పుసరిహద్దులో రష్యా, ఆగ్నేయసరిహద్దులో బెలారస్ దేశాలు ఉన్నాయి. బాల్టిక్ సముద్ర తీరానికి ఆవల పశ్చిమసరిహద్దులో స్వీడన్ దేశం ఉంది.లాట్వియా జనసంఖ్య 19,57,200.
Latvijas Republika లాట్విజాస్ రిపబ్లికా లాట్వియా గణతంత్ర రాజ్యము |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం |
||||||
Location of లాట్వియా (ముదురు ఆకుపచ్చ) – in ఐరోపా (లేత ఆకుపచ్చ & ముదురు నెరుపు) |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | రిగా 56°57′N 24°6′E | |||||
అధికార భాషలు | Latvian | |||||
జాతులు | 59.2% లాట్వియన్లు 28.0% రష్యన్లు 3.7% బెలారసియన్లు 2.5% ఉక్రెయినియన్లు 6.6% ఇతరులు [1] |
|||||
ప్రజానామము | లాట్వియన్ | |||||
ప్రభుత్వం | గణతంత్ర సమాఖ్య | |||||
- | రాష్ట్రపతి | |||||
- | ప్రధాన మంత్రి | |||||
Independence | from Russia and Germany | |||||
- | Declared1 | November 18, 1918 | ||||
- | Recognized | January 26, 1921 | ||||
- | Soviet occupation | August 5, 1940 | ||||
- | Nazi German occupation | July 10, 1941 | ||||
- | Soviet re-occupation | 1944 | ||||
- | Announced2 | May 4, 1990 | ||||
- | Restored | September 6, 1991 | ||||
Accession to the European Union |
May 1, 2004 | |||||
- | జలాలు (%) | 1.5 | ||||
జనాభా | ||||||
- | July 2009 అంచనా | 2,231,503 [2] (143rd) | ||||
- | 2000 ppl జన గణన | 2,375,000 | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $38.764 billion[3] | ||||
- | తలసరి | $15,218[3] | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $34.054 billion[3] | ||||
- | తలసరి | $11,909[3] | ||||
జినీ? (2003) | 37.7 (medium) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2008) | 0.863 (high) (44th) | |||||
కరెన్సీ | Lats (Ls) (LVL ) |
|||||
కాలాంశం | EET (UTC+2) | |||||
- | వేసవి (DST) | EEST (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .lv 3 | |||||
కాలింగ్ కోడ్ | ++371 | |||||
1 Latvia is de jure continuous with its declaration November 18, 1918. 2 Secession from Soviet Union begun. 3 Also .eu, shared with other European Union member states. |
1991 నుండి లాట్వియా ఐరాస సభ్యదేశంగా ఉంది. 2004 నుండి లాట్వియా ఐరోపా సమాఖ్య, నాటోలలో కూడా సభ్యదేశంగా ఉంది. [5] దేశవైశాల్యం 64589 చ.కి.మీ. [6] దేశంలో టెంపరేట్ సీజనల్ వాతావరణం నెలకొని ఉంటుంది.[7] శతాబ్దాలుగా స్వీడిష్ లియోనియన్, పోలిష్, రష్యన్ పాలనల తరువాత ప్రధానంగా అధికారబద్ధమైన బాల్టిక్ జర్మన్ కులీన పాలన అమలు చేయబడిన తరువాత 1818 నవంబరులో మొదటి ప్రపంచ యుద్ధం తరువాత రష్యా నుండి స్వాతంత్ర్యం ప్రకటించిన తరువాత లాట్వియా రిపబ్లిక్ స్థాపించబడింది. [8] అయినప్పటికీ 1930 ల నాటికి దేశంలో అరిస్టోక్రాటిక్ పాలన కొనసాగింది. 1934 లో తిరుగుబాటు తరువాత కార్లిస్ ఉల్మనిస్ ఆధ్వర్యంలో ఒక అధికార పాలనను స్థాపించబడిన తరువాత దేశం మరింత నిరంకుశంగా మారింది.1940లో సోవియెట్ యూనియన్‌లో లాట్వియా బలవంతపు ఆక్రమణతో తరువాత 1941 లో నాజీ జర్మనీ దండయాత్ర, ఆక్రమణ, 1944 లో సోవియట్ లచే తిరిగి ఆక్రమించుకోవడంతో, రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో దేశం వాస్తవ స్వాతంత్ర్యానికి అంతరాయం కలిగింది. తరువాతి యాభై సంవత్సరాలు లాట్వియన్ సోవియట్ సోషల్ రిపబ్లిక్‌గా ఉంది 1987 లో ప్రారంభమైన శాంతియుత విప్లవం,సోవియట్ పాలన నుండి బాల్టిక్ విమోచనకు పిలుపునిచ్చింది, "స్టాలినిస్ట్" అక్రమ ఆక్రమణ ఖండించబడింది.[9] 1990 మే 4 న లాట్వియా రిపబ్లిక్ స్వాతంత్ర్య పునరుద్ధరణ పై ప్రకటన ముగిసినప్పటికీ వాస్తవిక స్వాతంత్ర్యం 1991 ఆగస్టు 21న పునరుద్ధరించింది.[10] లాట్వియా ఒక ప్రజాస్వామ్య రిపబ్లిక్, అత్యంత అభివృద్ధి చెందిన దేశం.[ఆధారం చూపాలి]. దేశరాజధాని రిగా 2014 లో యూరోపియన్ సాంస్కృతిక రాజధానిగా పనిచేసింది. దేశానికి లాత్వియా అధికారిక భాషగా ఉంది.లాట్వియా ఒక సమైక్య దేశంగా ఉంది. ఇది 119 పరిపాలనా విభాగాలుగా విభజించబడింది. వీటిలో 110 మున్సిపాలిటీలు, 9 నగరాలు ఉన్నాయి.[11] లాట్వియా స్వదేశీ ప్రజలను లాట్వియన్లు అంటారు. [6] లాట్వియన్, లిథువేనియన్ రెండు బాల్టిక్ భాషలు మాత్రమే ప్రస్తుతం సజీవ బాల్టిక్ భాషలుగా ఉన్నాయి.13 వ శతాబ్దం నుండి 20 వ శతాబ్దాల వరకు విదేశీ పాలన ఉన్నప్పటికీ లాట్వియన్ దేశం భాష, సంగీత సంప్రదాయాల ద్వారా తరతరాల గుర్తింపును కొనసాగించింది. శతాబ్దాలుగా రష్యన్ పాలన (1710-1918), తరువాత సోవియట్ ఆక్రమణల ఫలితంగా లాట్వియా పెద్ద సంఖ్యలో రష్యన్లు (26.9% రష్యన్ లాట్వియా) ఉన్నారు.[12])వీరిలో కొందరు (లాట్వియాలో 14.1% మంది) మందికి పౌరసత్వం లేదు. రెండవ ప్రపంచ యుద్ధం వరకు, లాట్వియాలో జర్మనీకి చెందిన సంప్రదాయ జర్మన్లు, జ్యూస్‌లకు కూడా మైనారిటీలు ఉన్నారు. చారిత్రాత్మకంగా రోమన్ క్యాథలిక్‌గా ఉన్న ఆగ్నేయ ప్రాంతంలోని లాట్గేల్ ప్రాంతం మినహా లాట్వియా చారిత్రాత్మకంగా ప్రధానమైన ప్రొటెస్టంట్ లూథరన్ కేంద్రంగా ఉంది.[13] తూర్పు సాంప్రదాయ క్రైస్తవులలో రష్యన్ ప్రజలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.
ఇది యూరోపియన్ యూనియన్, నాటో, కౌన్సిల్ ఆఫ్ ఐరోపా, ఐక్యరాజ్యసమితి, సి.బి.ఎస్.ఎస్., ఐ.ఎం.పి., ఎన్.ఐ.బి., ఒ.ఇ.సి.డి., ఒ.ఎస్.సి.ఇ., డబల్యూ,టి.ఒ. సంస్థలలో సభ్యదేశంగా ఉంది. 2014 లో లాట్వియా మానవ అభివృద్ధి సూచికలో 46 వ స్థానంలో ఉంది. 2014 జూలై 1 న అధిక ఆదాయం కలిగిన దేశంగా వరల్డ్ బ్యాంక్ చేత గుర్తించబడింది.[14][15] యూరోజోన్‌లో పూర్తిస్థాయి సభ్యదేశంగా ఉంది. 2014 జనవరి 1న లాట్వియన్ కరెంసీ అయిన లాట్లకు బదులుగా కరెన్సీగా యూరోను ఉపయోగిస్తుంది.[16]