బెలారస్
From Wikipedia, the free encyclopedia
బెలారస్ లేదా బెలారుస్ (ఆంగ్లం:Belarus) (పాతపేరు: బైలో రష్యా, లేదా బెలో రష్యా) తూర్పు యూరప్‌లో ఉన్న ఒక భూపరివేష్టిత దేశం,[3] దీని ఉత్తరసరిహద్దు మరియ్ తూర్పుసరిహద్దులలో రష్యా, దక్షిణసరిహద్దులో ఉక్రెయిన్, పశ్చిమసరిహద్దులో పోలాండ్, ఉత్తరసరిహద్దులో లిథువేనియా, లాత్వియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నగరం, అత్యధిక జనసాంధ్రత కలిగిన దేశం మిన్స్క్ నగరం.దేశంలో 40% భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయి.[4][5] 20 వ శతాబ్దం వరకు వివిధ సమయాల్లో వివిధ రాజ్యాలు ఆధునిక కాలపు బెలారస్ భూభాగాలను నియంత్రించాయి. వాటిలో పోలోట్స్క్ రాజాస్థానం (11 నుంచి 14 శతాబ్దాలు), గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియా, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్, రష్యన్ సామ్రాజ్యం ఉన్నాయి.
Рэспубліка Беларусь Республика Беларусь రిపబ్లిక్ ఆఫ్ బెలారస్ |
||||||
---|---|---|---|---|---|---|
జాతీయగీతం Мы, беларусы (Belarusian) My, Belarusy (transliteration) We Belarusians |
||||||
Location of బెలారస్ (orange) on the European continent (white) — [Legend] |
||||||
రాజధాని అతి పెద్ద నగరం | Minsk 53°55′N 27°33′E | |||||
అధికార భాషలు | Belarusian, Russian | |||||
ప్రజానామము | Belarusian | |||||
ప్రభుత్వం | Presidential republic | |||||
- | President | Alexander Lukashenko | ||||
- | Prime Minister | Roman Golovchenko | ||||
Independence | from the Soviet Union | |||||
- | Declared | July 27, 1990 | ||||
- | Established | August 25, 1991 | ||||
- | Completed | December 25, 1991 | ||||
- | జలాలు (%) | negligible (2.830 km²)1 | ||||
జనాభా | ||||||
- | 2008 అంచనా | 9,689,800[1] (86th) | ||||
- | 1999 జన గణన | 10,045,200 | ||||
జీడీపీ (PPP) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $117.527 billion[2] (58th) | ||||
- | తలసరి | $12,344[2] (IMF) (65th) | ||||
జీడీపీ (nominal) | 2008 అంచనా | |||||
- | మొత్తం | $57.681 billion[2] | ||||
- | తలసరి | $6,058[2] (IMF) | ||||
జినీ? (2002) | 29.7 (low) | |||||
మా.సూ (హెచ్.డి.ఐ) (2006) | 0.817 (high) (67th) | |||||
కరెన్సీ | Belarusian ruble (BYR ) |
|||||
కాలాంశం | EET (UTC+2) | |||||
- | వేసవి (DST) | EEST (UTC+3) | ||||
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ | .by | |||||
కాలింగ్ కోడ్ | +375 | |||||
1 | "FAO's Information System on Water and Agriculture". FAO. Retrieved 2008-04-04. |
1917 రష్యన్ విప్లవం తరువాత బెలారస్ సోవియట్ రష్యా స్వాధీనం చేసుకున్న బెలారస్ పీపుల్స్ రిపబ్లిక్‌గా స్వాతంత్ర్యాన్ని ప్రకటించింది. సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ బైలోరుసియా 1922 లో సోవియట్ యూనియన్ స్థాపక రాజ్యాంగా సోవియట్ యూనియన్ రిపబ్లిక్లలో ఒకటి అయ్యింది, బైలోరష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (బైలోరియన్స్ ఎస్.ఎస్.ఆర్. ) గా పేరు మార్చబడింది. పోలిష్-సోవియట్ యుద్ధం 1919-1921 తరువాత బెలారస్ తన భూభాగంలో సగభాగాన్ని పోలాండ్ స్వాధీనం చేసుకుంది. పోలిష్ సోవియట్ ఆక్రమణ తరువాత రెండో పోలిష్ రిపబ్లిక్ కొన్ని భూములు తిరిగి ఇచ్చిన తరువాత 1939 లో బెలారస్ సరిహద్దుల ఆధునిక ఆకృతి ఏర్పడింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత సరిహద్దులు ఖరారు చేయబడ్డాయి.[6][7][8] రెండవ ప్రపంచ యుద్ధం సందర్భంగా సైనిక కార్యకలాపాలు బెలారస్‌ను నాశనం చేశాయి.దేశం మూడవ భాగం ప్రజలను, ఆర్థిక వనరులలో సగం కంటే అధికంగా కోల్పోయింది.[9] యుద్ధం తరువాత సంవత్సరాలలో రిపబ్లిక్ పునరభివృద్ధి చేయబడింది. 1945 లో బైలేరియన్స్ ఎస్.ఎస్.ఆర్ సోవియట్ యూనియన్, ఉక్రేనియన్ ఎస్.ఎస్.ఆర్.తో పాటు ఐక్యరాజ్యసమితి స్థాపక సభ్యదేశంగా మారింది.[10] రిపబ్లిక్ పార్లమెంట్ 1990 జూలై 27 న సోవియట్ యూనియన్ రద్దు సమయంలో బెలారస్ సార్వభౌమత్వాన్ని ప్రకటించింది. బెలారస్ 1991 ఆగస్టు 25 న స్వాతంత్ర్యం ప్రకటించింది.[11] 1994 నుండి " అలెగ్జాండర్ లుకాషేంకో " దేశానికి అధ్యక్షుడుగా పనిచేశారు. లుకాషేన్‌కో నిరంకుశ పాలనా శైలి కారణంగా బెలారస్‌ను కొంతమంది పాశ్చాత్య పాత్రికేయులు [12][13] చివరి యురేపియన్ నిరకుశ దేశంగా అభివర్ణిస్తారు.[14][15][16] లుకాషేన్‌కో ఆర్థిక వ్యవస్థలోని పెద్ద వర్గాల రాష్ట్ర యాజమాన్యం వంటి సోవియట్ యుగపు విధానాలను కొనసాగించారు. లుకాషేన్ పాలనలో నిర్వహించబడిన ఎన్నికలు అన్యాయమైనవిగా విమర్శించబడ్డాయి. రాజకీయ వ్యతిరేకత హింసాత్మకంగా అణిచివేయబడిందని అనేక దేశాలు, సంస్థలు భావించాయి. ఐరోపాలో మరణశిక్షను ఉపయోగించిన చివరి దేశం బెలారస్.[17][18][19] 2014 వరకు బెలారస్ ప్రజాస్వామ్య ఇండెక్స్ రేటింగ్ యూరోప్‌లో (ఇది రష్యా ఆమోదించినప్పుడు) అత్యల్పంగా ఉంది. ఫ్రీడమ్ హౌస్ దేశం "స్వేచ్ఛా రహిత"దేశంగా పేర్కొన్నది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ " అణచివేయబడింది", ఇప్పటివరకు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ప్రచురించిన 2013-14 ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో ఐరోపాలో ప్రెస్ స్వేచ్ఛ కోసం అత్యంత ఘోరమైన దేశం, 180 దేశాల్లో బెలారస్ 157 వ స్థానంలో ఉంది.[20]
2000 లో సహకారవిధానంలో బెలారస్, రష్యా యూనియన్ స్టేట్ ఏర్పాటు చేయడానికి ఒక ఒప్పందం మీద సంతకం చేసాయి. పట్టణ ప్రాంతాల్లో బెలారస్ జనాభాలో 70% పైగా ప్రజలు ( 9.49 మిలియన్లు )నివసిస్తున్నారు. జనాభాలో 80% కంటే ఎక్కువ మంది బెలారసియన్ ఉండగా గణీయమైన సంఖ్యలో రష్యన్లు, పోల్స్, ఉక్రైనియన్ మైనారిటీలు ఉన్నారు. 1995 లో ప్రజాభిప్రాయ సేకరణ తరువాత దేశం బెలారసియన్, రష్యన్ భాషలను రెండింటిని అధికారిక భాషలుగా కలిగి ఉంది. దేశంలో ప్రాథమిక మతం తూర్పు సంప్రదాయ క్రిస్టియానిటీ అయినప్పటికీ బెలారస్ రాజ్యాంగం ఏ అధికారిక మతాన్ని ప్రకటించలేదు. రెండవ అత్యంత విస్తృత మతం రోమన్ కాథలిక్కులు ఉన్నారు. ఈమతానుయాయులు సంఖ్యాపరంగా చాలా తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ బెలారస్ క్రిస్మస్, ఈస్టర్ సాంప్రదాయ, కాథలిక్ సంస్కరణలను జాతీయ సెలవులుగా జరుపుకుంటుంది.[21] చట్టపరంగా, ఆచారపరంగా రెండింటిలో మరణశిక్షను నిలుపుకున్న ఏకైక యూరోపియన్ దేశం బెలారస్.[22] బెలారస్ ఐక్యరాజ్యసమితిలో ఫండింగ్ సభ్యత్వం పొందినప్పటి నుండి కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, సి.ఎస్.టి.ఒ, ఇ.ఇ.యు., అలీన ఉద్యమం. బెలారస్ యూరోపియన్ యూనియన్ చేరడానికి ఎటువంటి ఆశయాలను చూపించలేదు. అయితే సంస్థతో ద్వైపాక్షిక సంబంధాన్ని నిర్వహిస్తుంది. అలాగే యురేపియన్ యూనియన్ ప్రాజెక్టులలో పాల్గొంటుంది. సెంట్రల్ యూరోపియన్ ఇనిషియేటివ్, బాకు ఇనిషియేటివ్.