సానియా మీర్జా
భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి / From Wikipedia, the free encyclopedia
సానియా మీర్జా (జననం:1986 నవంబరు 15) భారతీయ టెన్నిస్ క్రీడాకారిణి. ప్రస్తుతం ఆమె మహిళల డబుల్స్ లో నెం.1 ర్యాంకు పొందిన క్రీడాకారిణి[2].[3] 2003 నుండి 2013లో సింగిల్స్ నుండి విరమణ తీసుకునేదాకా విమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ ప్రకారం భారతదేశంలో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో నెం.1 క్రీడాకారిణిగా గుర్తింపబడ్డారు. సానియా కెరీర్ మొదట్నుంచే అత్యంత విజయవంతమైన భారతీయ టెన్నిస్ క్రీడాకారిణిగా నిలిచారు. ఎక్కువ పారితోషికం అందుకునే అథ్లెటిక్ క్రీడాకారిణి.[4][5]
పూర్తి పేరు | సానియా మీర్జా |
---|---|
దేశం | భారతదేశం |
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం |
జననం | (1986-11-15) 1986 నవంబరు 15 (వయసు 37) |
ఎత్తు | 1.73 metres (5 ft 8 in) |
కళాశాల | సెయింట్ మేరీస్ కాలేజ్ |
ప్రారంభం | 2003 |
ఆడే విధానం | రైట్ హ్యాండెడ్ (టూ - హ్యాండ్ బ్యాక్‌హ్యాండ్) |
బహుమతి సొమ్ము | US $6,570,862[1] |
సాధించిన రికార్డులు | మూస:Tennis record |
సాధించిన విజయాలు | 1 WTA, 14 ITF |
అత్యుత్తమ స్థానము | No. 27 (27 August 2007) |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | 3R (2005, 2008) |
ఫ్రెంచ్ ఓపెన్ | 2R (2007, 2011) |
వింబుల్డన్ | 2R (2005, 2007, 2008, 2009) |
యుఎస్ ఓపెన్ | 4R (2005) |
Other tournaments | |
Olympic Games | 1R (2008) |
Career record | మూస:Tennis record |
Career titles | 41 WTA, 4 ITF |
Highest ranking | No. 1 (13 April 2015) |
Current ranking | No. 7 (20 March 2017) |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | గెలుపు (2016) |
ఫ్రెంచ్ ఓపెన్ | F (2011) |
వింబుల్డన్ | W (2015) |
యుఎస్ ఓపెన్ | W (2015) |
Other Doubles tournaments | |
Championships | W (2014, 2015) |
Olympic Games | 2R (2008) |
Career titles | 3 |
ఆస్ట్రేలియన్ ఓపెన్ | గెలుపు (2009) |
ఫ్రెంచ్ ఓపెన్ | W (2012) |
వింబుల్డన్ | QF (2011, 2013, 2015) |
యుఎస్ ఓపెన్ | W (2014) |
Other Mixed Doubles tournaments | |
Olympic Games | SF (2016) |
Last updated on: 20 March 2017. |
ఆమె సింగిల్స్ కెరీర్ లో స్వెట్లనా కుజ్నెస్టోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి, ప్రపంచ నెం.1 ర్యాంకు సాధించిన మార్టినా హింగిస్, డినారా సఫినా వంటి క్రీడాకారిణులపై గుర్తించదగిన విజయాలు నమోదు చేసుకున్నారు. 2007లో సింగిల్స్ లో ప్రపంచవ్యాప్తంగా 27వ ర్యాంకులో నిలిచారు. భారతదేశం నుంచి అత్యధిక ర్యాంకింగ్ కలిగిన మహిళా క్రీడాకారిణిగా ప్రసిద్ధి చెందారామె. మణికట్టు కు తీవ్రమైన దెబ్బ తగలడం వల్ల సింగిల్స్ కు దూరమయ్యరు. కానీ డబుల్స్ లో ప్రప్రంచ నెం.1 ర్యాంకు సాధించారు.[6] తన కెరీర్ లో 1 మిలియన్ డాలర్ల(ఇప్పుడు 5 మిలియన్ డాలర్లు) సంపాదించడంతో పాటు, ఆరు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టైటిళ్ళను సంపాదించి స్వంత దేశానికి మంచి పేరు తెచ్చారామె. మహిళల డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ లోను ఆరు టైటిల్స్ గెలుచుకున్నారు. మహిళా టెన్నిస్ అసోసియేషన్ ఫైనల్స్_2014లో అర్హత సాధించుకోవడంతో పాటు టైటిల్ కూడా గెలుచారు.[7]
గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ కు చేరిన ఒపెన్ ఎరాకు చెందిన మూడవ మహిళ సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ క్రీడలు, ఆఫ్రో-ఆసియా క్రీడల్లో ఆమె 14 పతకాలను సాధించుకున్నారు. అందులో 6 బంగారు పతకాలు.
అక్టోబరు 2005లో టైం పత్రిక సానియాను "50 హీరోస్ ఆఫ్ ఆసియా"గా పేర్కొంది. ది ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఆమెను "33 విమెన్ హూ మేడ్ ఇండియా ప్రౌడ్" జాబితాలో చేర్చింది. 2013 నవంబరు 25లో మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్షిణాసియా నుండి యుఎన్ మహిళల సౌహార్ధ అంబాసిడర్ గా సానియాను నియమించారు.
2015లో వింబుల్డన్ విమెన్స్ డబుల్స్ ను గెలుపొందిన సానియా మీర్జా 2022 వింబుల్డన్ మిక్స్ డ్ డబుల్స్ లో ఓటమిపాలైంది. ఇక ఇంతకు ముందే ప్రకటించిన విధంగా డబ్ల్యూటీఏ సర్క్యూట్ కు వీడ్కోలు పలికింది.[8]