కాంతి
కనిపించే వర్ణపటంలో లేదా సమీపంలో విద్యుదయస్కాంత వికిరణం / From Wikipedia, the free encyclopedia
అన్ని జీవుల జీవక్రియలను కాంతి (లాటిన్: Lux, జర్మన్: Licht, స్పానిష్, పోర్చుగీస్: Luz, ఆంగ్లం: Light, ఫ్రెంచి: Lumière) ప్రభావితం చేస్తుంది. కాంతికి ముఖ్యమైన ఉత్పత్తి స్థానం సూర్యుడు. జీవులన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సూర్యుని నుంచి శక్తిని పొందుతాయి. సూర్యుడు వికిరణ శక్తిని విద్యుదయస్కాంత తరంగాలుగా విడుదల చేస్తాడు.[1] వీటిలో దేనినైతే మానవుడి కన్ను గ్రహించగలుగుతుందో దాన్ని దృగ్గోచర కాంతి లేదా దృగ్గోచ వర్ణపటలం అంటారు. దీని తరంగదైర్ఘ్యం 380 nm నుంచి 760 nm వరకు ఉంటుంది.[2] సౌరశక్తిలో చాలా తక్కువ భాగం మాత్రమే వాతావరణం పైపొర వరకు చేరుతుంది. ఇందులో 45 శాతం మాత్రమే భూతలానికి చేరుతుంది. జీవులకు లభించే మొత్తం కాంతి ఆవాసం, ఋతువులను బట్టి మారుతుంది.