ప్రపంచ వారసత్వ ప్రదేశం
ప్రపంచ వారసత్వ ప్రదేశం, అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. / From Wikipedia, the free encyclopedia
ప్రపంచ వారసత్వ ప్రదేశం, అనేది ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తుంది. (ఉదా: అడవి, పర్వతం, సరస్సు, ఎడారి, కట్టడం, నిర్మాణం, లేదా నగరం, దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీచే ప్రపంచ వారసత్వ గుర్తింపు కార్యక్రమాన నిర్వహింపబడి, దానిని జాబితాలో నామినేట్ చేస్తుంది.
ఈ కమిటీలో 21 రాష్టాల పార్టీలుంటాయి.[1] వీటికి రాష్ట్రపార్టీల జనరల్ శాసనసభ, 4 సంవత్సరాల కొరకు ఎన్నుకుంటుంది.[2] ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం, సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తూ మానవుల వారసత్వాన్ని ఇతర తరాలకు అందించడం. 2008 వరకు 851 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు 141 రాష్ట్ర పార్టీల యందు ఉన్నాయి. వీటిలో 660 సాంస్కృతిక, 166 సహజసిద్ధ, 25 మిశ్రమ ప్రత్యేకతల ప్రదేశాలున్నాయి.[3]