షాజహాన్
From Wikipedia, the free encyclopedia
షహాబుద్దీన్ ముహమ్మద్ షాహ్ జహాఁ (ఆంగ్లం : Shabuddin Mohammed Shah Jahan) పూర్తి పేరు అల్ హజ్రత్ అబుల్-ముజాఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్ షాజహాన్ (బిరుదు : అల్-సుల్తాన్ అల్-ఆజమ్ వల్-ఖాఖాన్ అల్-ముకర్రం, అబుల్-ముజఫ్ఫర్ షిహాబుద్దీన్ ముహమ్మద్, సాహిబే ఖిరానే సాని, షాహ్ జహాఁ I పాద్షాహ్ గాజి జిల్లు'ల్లాహ్ [ఫిర్దోస్-ఆషియాని]) (ఇంకనూ షాహ్ జహాఁ, షాజెహాన్, షాజహాన్, షాజహాను అని కూడా పలుకుతారు. (ఉర్దూ : شاه جهان), జననం జనవరి 5, 1592 ; మరణం జనవరి 31, 1666. మొఘల్ సామ్రాజ్యపు చక్రవర్తి, 1628 నుండి 1658 వరకూ భారతదేశాన్ని పరిపాలించాడు. షాజహాన్ పదము పర్షియన్ భాషా పదము, అర్థం ; షాహ్ "రాజు", జహాఁ "ప్రపంచం", "ప్రపంచపు రాజు". బాబరు, హుమాయూన్, అక్బరు, జహాంగీరు ల తరువాత ఇతను ఐదవ మొఘల్ చక్రవర్తి.
షాజహాన్ | |
---|---|
మొఘల్ సామ్రాజ్యం | |
17వ శతాబ్దపు షాజహాను చిత్రం | |
పరిపాలన | 1628 - 1658 |
పూర్తి పేరు | షాబుద్ధీన్ మొహమ్మద్ షాజహాన్ |
జననం | జనవరి 5, 1592 |
జన్మస్థలం | లాహోర్ |
మరణం | జనవరి 31, 1666 (age 74) |
మరణస్థలం | ఆగ్రా |
సమాధి | తాజ్మహల్ |
ఇంతకు ముందున్నవారు | జహంగీర్ |
తరువాతి వారు | ఔరంగజేబు |
భార్యలు | Akbarabadi Mahal (d. 1677) Kandahari Mahal (b. 1594, m. 1609) ముంతాజ్ మహల్ (b. 1593, m. 1612, d. 1631) Hasina Begum Sahiba (m. 1617) Muti Begum Sahiba Qudsia Begum Sahiba Fatehpuri Mahal Sahiba (d. after 1666) Sarhindi Begum Sahiba (d. after 1650) Shrimati Manbhavathi Baiji Lal Sahiba (m. 1626) |
సంతానము | జహాఁ ఆరా , Dara Shukoh, Shah Shuja, Roshanara Begum, Aurangzeb, Murad Baksh, Gauhara Begum |
వంశము | తైమురిద్ |
తండ్రి | జహాంగీర్ |
తల్లి | Princess Manmati[1] |
జహాంగీరు తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఇతని కాలం 'మొఘల్ సామ్రాజ్యంలో స్వర్ణయుగం' అని భావిస్తారు. తాను అక్బరును ఆదర్శంగా తీసుకున్నాడని ప్రతీతి.