సారాహ్
From Wikipedia, the free encyclopedia
సారాహ్ : ప్రవక్త ఇబ్రాహీం భార్య ఇస్ హాక్ (ఇస్సాకు) తల్లి. ఇబ్రాహీంను ఇస్మాయీల్, హాజరా లను ఎడారిలో వదిలేసి రమ్మని చెబుతుంది. ఈమె సంతానం నుండే యూదులు ఏసుక్రీస్తు జన్మించారు. ముస్లిములు ఈమెను సారాహ్ అంటారు. ఈమె మొదట గొడ్రాలు అయ్యి పిల్లలు కలగకపోతే తన దాసి అయిన హాజరాను ఇబ్రాహీంతో పెళ్ళాడమని కోరి, ఇబ్రాహీం వంశాన్ని కనమని కోరుతుంది.
సారా మొదటి పేరు సారయి (అనగా రాజకుమారి లేదా తగాదాకోరు). సారయి పేరు సారాగా మారినది. సారయి పేరుకి పరిపాలకురాలు, రాణి అని అర్థం. బైబిల్ ప్రకారం ప్రభుఫు ఆమెను దీవించి ఆమె నుండి అనేక జాతులను, రాజులను ఉధ్భవించేలా చేశారు. అబ్రహాము బహు జాతులకు తండ్రి. అయితే సారా బహుజాతులకు, రాజులకు జన్మనిచ్చింది. ఈ కోవలోనే మెస్సయ్యా పుట్టారు.