హరామ్
From Wikipedia, the free encyclopedia
హరామ్ - Ḥarām (అరబ్బీ: حَرَام ḥarām) ఇది ఒక అరబ్బీ, ఇస్లామీయ పదజాలము. ఇస్లామీయ న్యాయశాస్త్రం ప్రకారం ఇది ప్రామాణిక పాపం, లేదా నిషిద్ధం. హరాం అనే పదము సాధారణంగా అల్లాహ్ చే నిషేధింపబడినది అనే అర్థానికి వాడుతారు. الأحكام الخمسة (అల్-ఆహ్ కామ్ అల్-ఖమ్సా) (ఐదు న్యాయ ఆదేశాలు) లలో ఒకటి. ఇది మానవుల సత్ప్రవర్తనలను, నీతి శాస్త్రాలను నిర్దేశిస్తుంది.[1]