దేశాల జాబితా - ఐక్య రాజ్య సమితి సభ్యులు
From Wikipedia, the free encyclopedia
ఐక్య రాజ్య సమితిలో సభ్యులు (List of countries in the United Nations) ఈ జాబితాలో ఇవ్వబడ్డాయి. 2017 నాటికి ఐక్య రాజ్య సమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రతి సభ్య దేశమూ ఐ.రా.స. సాధారణ సభలో సభ్యత్వం కలిగి ఉంటుంది. ఐ.రా.స. చార్టర్ 2వ ఛాప్టర్ 4వ ఆర్టికిల్ ప్రకారం ఏదైనా దేశానికి ఐ.రా.స. సభ్యత్వం రావాలంటే ఐ.రా.స. భద్రతా సభ ఆమోదంపై, ఐ.రా.స. సాధారణ సభ తీర్మానం జరగాలి. . నియమాల ప్రకారం సంపూర్ణ స్వాధిపత్యం ఉన్న దేశాలు మాత్రమే సభ్యత్వానికి అర్హత కలిగి ఉంటాయి. కాని ఐ.రా.స. ఏర్పాటు సమయంలో చేరిన నాలుగు ఆరంభ సభ్య దేశాలకు (బెలారస్, భారతదేశం, ఫిలిప్పీన్స్, ఉక్రెయిన్) అప్పటికి సంపూర్ణ స్వాతంత్ర్యం లేదు. అంతే కాకుండా భద్రతా సభ ఆమోదం ఉండాలన్న నిబంధన కారణంగా మాంటివిడియో కన్వెన్షన్ ప్రకారం స్వాధిపత్యం కలిగిన కొన్న దేశాలు కూడా, మరి కొన్ని ఐ.రా.స. సభ్య దేశాలు వ్యతిరేకించిన కారణంగా ఐ.రా.స. సభ్యత్వం కలిగి లేవు.
కొన్ని అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, సంపూర్ణ స్వాధిపత్యం స్పష్టంగా లేని దేశాలు ఐ.రా.స. సాధారణ సభలో "పరిశీలకులు" (అబ్సర్వర్) హోదాను మాత్రం పొందగలవు. వారి ప్రతినిధులు సమావేశాలలో పాల్గొనగలరు గాని వారి ఓటు హక్కు ఉండదు.