బృహదారణ్యకోపనిషత్తు
From Wikipedia, the free encyclopedia
బృహదారణ్యకోపనిషత్తు (సంస్కృతం : बृहदारण्यक उपनिषद्) ఉపనిషత్తులలో ప్రాచీనమైనది, ముఖ్యమైనది. ఇది శతపత బ్రాహ్మణములో భాగము, అదే సమయములో దీనిని ఈ బ్రాహ్మణము నుండి సంగ్రహించబడినదని తెలుస్తున్నది. ఇది శుక్ల యజుర్వేదమునకు చెందినది. ముక్తికా సూత్రమునందున్న 108 ఉపనిషత్తులలో ఇది పదవ స్థానమునందు ఉంది. దీనికి ఆదిశంకరాచార్యులు భాష్యము రాశారు.ఇందు శ్వమేధమును గురుంచి చెప్పబడింది. ఆత్మనుండి ప్రపంచము సృష్టి అయినట్లుకలదు. 2వ భాగమందు వేదాంత చర్చలు ఉన్నాయి. బ్రహ్మ శాస్త్రములచే నగమ్యుడనియు, అభ్యాసము వలన బ్రహ్మను కనుక్కొనవచ్చునని తెలుపబడింది. యాజ్ఞవల్క్యజనకులకు జరిగిన చర్చ ఇందు ఉంది. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ యనగ అచ్యుతుడు నిరంజనుడు, నరాకారుడు, అచలుడు అని చెప్పియున్నాడు. జనకునకును యాజ్ఞవల్క్యునకును ఆత్మను గూర్చి చర్చయు, ఇందాత్మకు కల జాగ్రత్ స్వప్న సుషుప్త్యా వస్థలగురుంచి వివరింపబడింది. ఇట్టి గ్రంథము హైందవవాజ్మయమందు లేదనుట అతిశయోక్తి కాదు.యాజ్ఞవల్క్యనకును ఆతని భార్య మైత్రేయికిని జరిగిన సంభాషణము ఇందు గృహమును త్యజించి వాన ప్రస్థమును స్వీకరించుటకు గల విషయములు వర్ణితములు. ఇందు పునర్జన్మ గురుంచి చెప్పబడియున్నది. శుక్లయజుర్వేదములలో పెద్దది చాందోగ్యము, చిన్నది ఏశానోపనిష్యత్తు.
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
వేదములు (శ్రుతులు) | |
---|---|
ఋగ్వేదం · యజుర్వేదం | |
సామవేదము · అధర్వణవేదము | |
వేదభాగాలు | |
సంహిత · బ్రాహ్మణము | |
అరణ్యకము · ఉపనిషత్తులు | |
ఉపనిషత్తులు | |
ఐతరేయ · బృహదారణ్యక | |
ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
కఠ · కేన · ముండక | |
మాండూక్య ·ప్రశ్న | |
శ్వేతాశ్వర | |
వేదాంగములు (సూత్రములు) | |
శిక్ష · ఛందస్సు | |
వ్యాకరణము · నిరుక్తము | |
జ్యోతిషము · కల్పము | |
స్మృతులు | |
ఇతిహాసములు | |
మహాభారతము · రామాయణము | |
పురాణములు | |
ధర్మశాస్త్రములు | |
ఆగమములు | |
శైవ · వైఖానసము ·పాంచరాత్రము | |
దర్శనములు | |
సాంఖ్య · యోగ | |
వైశేషిక · న్యాయ | |
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
ఇతర గ్రంథాలు | |
భగవద్గీత · భాగవతం | |
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
శివ సహస్రనామ స్తోత్రము | |
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
... · ... | |
ఇంకా చూడండి | |
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం |